Begin typing your search above and press return to search.

గ్లిమ్స్ టాక్ : అమ్మాయిల పాలిట రావ‌ణాసురుడు

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:55 AM GMT
గ్లిమ్స్ టాక్ : అమ్మాయిల పాలిట రావ‌ణాసురుడు
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ 'ధ‌మాకా' బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు. త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కించిన ఈ మూవీ వంద కోట్లకు పైనే వ‌సూల్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఆ త‌రువాత చిరుతో క‌లిసి 'వాల్తేరు వీర‌య్య‌'లో క‌నిపించిన ర‌వితేజ పూన‌కాలు తెప్పించాడు. ప్ర‌స్తుంత ఈ మూవీ కూడా వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇదిలా వుంటే గురువారం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున మాస్ మ‌హారాజా త‌న 55వ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు.

ప్ర‌స్తుతం త‌ను న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'రావ‌ణాసుర‌'. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌తో క‌లిసి ఆర్ టీ టీమ్ వ‌ర్క్స్, అభిషేక్ పిక్చ‌ర్స్‌ బ్యాన‌ర్స్‌ పై ర‌వితేజ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా నాగ‌ర్క‌ర్‌, పూజితా పొన్నాడ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 26న ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు.

థీమ్ మ్యూజిక్ మొద‌ల‌వగా బ్లాక్ సూట్ ధ‌రించి ర‌వితేజ స్టైల్ గా న‌డుచుకుంటూ వెళుతున్న విజువ‌ల్స్ తో గ్లిమ్స్ మొద‌లైంది. మ‌రో చోట ర‌వితేజ వెళుతుండ‌గా బుల్ స్టీల్ హెడ్ పై బ్ల‌డ్ మ‌ర‌క‌లు..మ‌రో చోట టైప్ పై ఓ యువ‌తి శ‌వం.. మరో చోట వ‌ర్షం కురుస్తుండ‌గా రోడ్డుపై హ‌త్య‌కు గురైన యువ‌తి బాడీ..మ‌రో యువ‌తిని బెడ్ పై మూతి మూసి హ‌త్య చేసే ప్ర‌య‌త్నం... ఈ వ‌రుస హ‌త్య‌ల మ‌ధ్య చిద్విలాసం చిందిస్తూ ర‌వితేజ సిగార్ ని వెళిగిస్తూ త‌న యాటిట్యూడ్ ని చూపిస్తున్న తీరు.. ప‌క్క‌నే ఘోస్ట్ ఆకారం ఫొటోలు.. వున్న తీరు ఇంట్రెస్టింగ్ గా వుంది.

'హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్‌' అనే క్యాప్ష‌న్ తో స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నాడు. ప‌ద ర‌కాల గెట‌ప్ ల‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ మూవీలో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

అందుకే ఈ మూవీకి 'రావ‌ణాసుర‌' అనే టైటిల్ ని జ‌స్టిఫికేష‌న్ గా వుంటుంద‌ని ఖ‌రారు చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇంత‌కీ హీరోయిన్ ల‌లో ఒక్కొక్క‌రిని చంపుతున్న‌ది ఎవ‌రు?.. ఈ వ‌రుస హ‌త్య‌ల‌కు ర‌వితేజ‌కు వున్న సంబంధం ఏంటీ? .. త‌నే హ‌త్య చేస్తున్నాడా?.. లేక త‌న‌లా వున్న మ‌రో వ్య‌క్తి ఈ హ‌త్య‌లు చేస్తున్నాడా అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

బ్యాక్ టు బ్యాక్ వ‌రుసగా ర‌వితేజ న‌టించిన రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకోవ‌డంతో 'రావ‌ణాసుర‌'పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ద‌క్షా నాగ‌ర్క‌ర్ ప్ర‌తినాయిక ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో, 'అర్జున్ రెడ్డి'కి నేప‌థ్య సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. విజ‌య్ కార్తిక్ క‌న్న‌న్ సినిమాటోగ్రఫీని అందిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్ రాజ్ న‌టిస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.