రావణాసుర సెన్సార్ రిపోర్ట్.. ఇది ఊహించలేదు రాజా

Thu Mar 30 2023 22:19:06 GMT+0530 (India Standard Time)

Ravanasura Censor Report

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావణాసుర. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఆవిష్కరించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ గా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఆవిష్కరించారు.అలాగే రవితేజ క్యారెక్టర్ ని కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా ప్రెజెంట్ చేశారు. దీనిని బట్టి సుదీర్ వర్మ ఏదో ఇంటరెస్టింగ్ కథని చెప్పబోతున్నాడు అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ ఒక ఎత్తయితే ఈ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఫరియా అబ్దులా మేఘా ఆకాష్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్స్ గా నటించారు.

ఇక ఫరియా మేఘా ఆకాష్ పాత్రలకి మూవీలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వలన దీనికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈ మూవీ రన్ టైం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటికే రవితేజ స్టార్ట్ చేశాడు.

ఒకటో తేదీ నుంచి అగ్రిసేవ్ మోడ్ లో ప్రమోషన్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు.

ఇక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరిని పిలవాలనే విషయంపై చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. ఇక ఈ ఏడాది వాల్తేర్ వీరయ్యతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న రవితేజ ఇప్పుడు రావణాసుర మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.