రతన్ టాటా బయోపిక్ ఇప్పట్లో కష్టమేనా..?

Sun Dec 04 2022 15:00:36 GMT+0530 (India Standard Time)

Sudha Kongara Responded Social Media Platform About Ratan Tata Bio Pic

తమిళ చిత్ర సీమలో లేడీ డైరెక్టర్ గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సుధా కొంగర. శ్రీరామ్ విష్ణు విశాల్ కలిసి నటించిన `ద్రోహి` మూవీతో మంచి పేరు తెచ్చుకుని కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన సుధాకొంగర ఆ తరువాత `ఇరుది సుట్రు`తో మరింత పాపులారిటీని దక్కించుకుంది.ఆ సినిమా కారణంగానే సూర్య దృష్టిలో పడిన సుధా కొంగర `సూరారైపోట్రు` పేరుతో ఏయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఓ భారీ మూవీని తెరకెక్కించి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

తమిళంతో పాటు తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తోంది. హీరో సూర్య 2డీ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తూ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వేంది. త్వరలోనే భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయాలని హీరో సూర్య ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత సుధా కొంగర భారత్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవిత కథ ఆధారంగా బయోపిక్ ని తెరపైకి తీసుకురాపనున్నారని వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఏయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ స్ఫూర్తితో `ఆకాశమే నీ హద్దురా` మూవీని తెరకెక్కించి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలు పురస్కారాల్ని సొంతం చేసుకున్న సుధా కొంగర .. రతన్ టాటా బయోపిక్ చేయబోతోందనగానే ప్రేక్షకుల్లో అమితాస్తి మొదలైంది.

అయితే ఈ వార్తలపై తాజాగా సుధా కొంగర సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సినిమాపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులే అని కొట్టి పారేశారు. `రతన్ టాటాకు నేను వీరాభిమానిని ఆయన బయోపిక్ ని తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా తదుపరి సినిమాపై మీరు చూపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు.

త్వరలోనే నా తదుపరి సినిమా వివరాలు ప్రకటిస్తా` అన్నారు. `ఆకాశమే నీ హద్దురా` బాలీవుడ్ రీమేక్ తరువాత సుధా కొంగర `కేజీఎఫ్` మేకర్స్ హోంబలే ఫిలింస్ వారు నిర్మాణంలో తెరపైకి రానున్న సినిమాకు దర్శకత్వం వహించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.