Begin typing your search above and press return to search.
'సామీ సామీ' హుక్ స్టెప్ కి రష్మిక హిప్ అలా!
By: Tupaki Desk | 22 March 2023 4:00 PM'పుష్ప'లో రష్మిక మందన్న వేసిన 'సామీ సామీ' సిగ్నేచర్ హుక్ స్టెప్ నెట్టింట ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ స్టెప్ కి హిప్ కదపని వారంటూ లేరు. కుర్రాళ్ల నుంచి ముసలి ముతక వరకూ సామీ సామీ అంటూ రీల్స్ చేసినవారే. భారతదేశం సరిహద్దులు సైతం దాటి సంచలనం రేపిన సాంగ్ అది. అయితే ఇలా ఎంత మంది ఈ స్టెప్ ని అందుకున్నా? రష్మిక వేస్తే మాత్రం అదో ప్రత్యేకత.
రష్మిక హిప్ మూవ్ మెంట్ కి అలా లాక్ అవ్వాల్సిందే. రష్మిక ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లిన సామీ సామీ హిప్ మూవ్ మెంట్ ఇచ్చే వరకూ వదిలేవారు కాదు. ఆమె కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకుని అభిమానుల కోరిక మేరకు డాన్స్ చేసేది.
ఇప్పటివరకూ ఇలా ఎన్నిసార్లు సామీ సామీ అంటూ రచ్చ చేసిందో ఆమెకి కూడా గుర్తుండదు. వెళ్లిన ప్రతీ చోట రష్మిక వస్తుందంటే? అక్కడ సామీ పాటకు నడుం తిప్పాల్సిందే అన్నంతగా ఫేమస్ అయింది.
సోషల్ మీడియాలో మీమ్స్ అలాగే వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే పాటకు నీతో పాటు డాన్సు చేయాలని ఉందని ఒక నెటి జనుడు అడిగాడు. దీనికి రష్మిక ఏమని బధులిచ్చిందంటే? ఇప్పటికే సామీ సామీ పాటకి చాలాసార్లు డాన్సు చేసాను. ఇదే కంటున్యూ చేస్తే వెన్నులో సమస్యలు వస్తాయి. నువ్వు నన్ను ఎందుకు ఇలా అడిగాడు? ఎప్పుడు కాదు ఇంకేదైనా చేద్దాం' అని అంది.
దీంతో సామీ సామీ హుక్ స్టెప్ ని ఇక రష్మిక నుంచి ఆశించాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ కాదనకుండా ఎక్కడబడితే అక్కడ వేసిన రష్మిక ఇక నుంచి ఆ స్టెప్ వేయాలనుకోవడం లేదని తెలుస్తోంది.
వేసి వేసి ఆమెకి కూడా బోర్ కొట్టేసింది. ఇకపై కొత్తగా ట్రై చేద్దాం? అంటోంది మరి అలాంటి సిగ్నెచర్ స్టెప్ పుష్ప-2లో ఏమైనా ఉంటుందా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.