ఫోటో స్టోరి: అందం అంటే నీవా.. ఓ చెలియ!

Mon Jul 26 2021 17:31:38 GMT+0530 (IST)

Beautiful Rashmika From The Sets Of AMJ

ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ.... ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా...ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ.. కళ్ల ముందర స్వర్గం నీవా .. అందం అంటే అర్థం నీవా.. నడిచి వొచ్చిన బాపు బొమ్మవా...!!  ఐశ్వర్యారాయ్ ని చూశాక `రోబో` చిత్రం కోసం సినీకవులు అల్లిన కవిత ఇది. ఇప్పటికీ ఈ పాట ట్రెండీగా యువతరాన్ని ఆకర్షిస్తుంది.

అందాల రష్మిక మందనను చూసినా అభిమానులు అంతే ఇదిగా కవులు అయిపోతున్నారు. కవి కాని వాడైనా కాళిదాసుగా మారుతున్నాడు. నేటితరంలో రష్మిక నేచురల్ బ్యూటీగా పాపులరై ఇట్టే కనెక్టయిపోతోంది. ఇండస్ట్రీలో అత్యంత బిజీయెస్ట్ హీరోయిన్ గా వండర్స్ క్రియేట్ చేస్తున్న రష్మిక మందన అటు బాలీవుడ్ లో నటిస్తూనే ఇటు శర్వా మూవీ ఆడాళ్లు మీకు జోహార్లు కోసం సెట్స్ లో ఇటూ అటూ మారుతోంది.

ప్రస్తుతం రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా  స్పాట్ నుంచి ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఆన్ లొకేషన్ అలా ల్యాప్ టాప్ లో ఫుటేజ్ ని పరిశీలించేప్పుడు అరుదైన ముగ్ధమనోహరమైన స్నాప్ అలా కుదిరింది. ఈ ఫోటో చూశాక.. అందం అంటే నీవా...! అంటూ కవితలు అల్లేస్తున్నారు బోయ్స్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చక్కని కుటుంబ కథా చిత్రం. శర్వా మార్క్ పెర్ఫామెన్స్ కి రష్మిక అందచందాలు ఎనర్జిటిక్ నటన అదనపు అస్సెట్ కానున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.