బెస్ట్ ప్రెండ్ రాగిని పెళ్లిలో రష్మిక ఇలా?

Mon May 16 2022 12:44:40 GMT+0530 (IST)

Rashmika in Friend Ragini Marriage?

కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవల బెంగుళూరు ఎయిర్ పోర్టులో చిక్కిన సంగతి తెలిసిందే. బ్లాక్ కలర్ దుస్తుల్లో బ్యాగ్ తగిలించుకుని హడావుడిగా ప్లైట్ ఎక్కడానికి వెళ్తోన్న వైనాన్ని గమనించాం. దీంతో రష్మిక ఎక్కడికి ఇంత హడావుడిగా బయల్దేరింది? 'యానిమల్ ' షూటింగ్ కోసం ఇలా హడావుడి పడుతుందా? అని సందేహాలు వ్యక్తం అయ్యాయి.అయితే ఈ టెన్షన్ అంతా స్నేహితురాలి పెళ్లి కోసమని  వెలుగులోకి వచ్చింది. తాజాగా రష్మిక తన స్నేహితులందరితో కలిసి దిగిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. రష్మిక తన చిన్న నాటి స్నేహితురాలి పెళ్లి కోసమే వెళ్లినట్లు రివీల్ చేసింది. అలాగే ఈ ఫోటోని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నా లైఫ్ ఇలా ఉండేదని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని పంచుకుంది. అవెంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు నాకు బాగా దగ్గరైన రాగిని పెళ్లి. ఈరోజు దాటితే తర్వాత ఆమెతో ఫోటో కూడా దిగలేను. ప్రపంచం కోసం ఈరోజుని మిస్ చేసుకోవాలనుకోవడం లేదు.

తెల్లవారుజామున 4 గంటలకు ప్లైట్ మిస్ అవ్వడం.. మరో ప్లైట్ కూడా నాలుగైదు సార్లు ఆలస్యం కావడం. ఇలా వరుస ఇబ్బందులతో పెళ్లికి వెళ్లగలానా? లేదా? అని సందేహం వచ్చింది. కానీ దేవుడి దయల వల్ల ఎలాగో పెళ్లి సమయానికి హాజరయ్యాను. ఈ అమ్మాయిల ఉన్న గుంపులోనే నేను పెరిగి పెద్దదాన్ని అయ్యాను.  

17 ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. ఇప్పటికి వీళ్లలో ఏ మార్పు  రాలేదు. నన్ను ఎంతో సంతోషంగా చూసుకున్నారు. ఈరోజు వీళ్లందర్నీ కలవడం ఎంతో సంతోషంగా  ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా.  రష్మిక నే యువతి పరిచయం కాకముందు ఇలా ఉండేదాన్ని. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని'' రష్మిక తెలిపింది.  స్నేహితులంతా పెళ్లి సందర్భంగా అంతా అందంగా ముస్తాబైన ఫోటోల్ని రష్మిక అభిమానులకు షేర్ చేసింది.

రష్మిక స్నేహానికి ఎంత విలువ ఇస్తుందన్నది అర్ధమవుతుంది. 17 ఏళ్ల వయసులో మొదలైన స్నేహాన్ని ఇప్పటికీ మర్చిపోకుండా అలాగే కంటున్యూ చేస్తుంది.  అప్పటి నుంచి స్నేహితులకు టచ్ లోనే ఉంటుంది. పెళ్లిళ్లు..పెరాంటాలకు ఆహ్వానిస్తే  తప్పక  హాజరవుతుంది. తన స్టార్ డమ్ ని మర్చిపోయి సాధరణ అమ్మాయిలా అందరితో కలిసిపోవడం రష్మిక గొప్పతనమే అనాలి.