మాది మంచి జోడీ అంతకు మించి ఏమీ లేదు

Thu Jul 18 2019 23:00:01 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న జోడీకి 'గీత గోవిందం' చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో తాజాగా వీరిద్దరు కలిసి నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలు లిప్ లాక్ చేశారు. ట్రైలర్ లోనే ఆ విషయం వెళ్లడయ్యింది. ఇక వీరిద్దరి జోడీ మరోసారి ఫిదా చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెగ ప్రమోట్ చేస్తున్నారు.ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డియర్ కామ్రేడ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరు మ్యూజికల్ ఫెస్టివల్ లో రెచ్చి పోయి మరీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. దాంతో వీరిద్దరి మద్య వ్యవహారం నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది. గీత గోవిందం సమయంలోనే విజయ్ దేవరకొండతో ప్రేమ కారణంగానే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను బ్రేకప్ చేసుకుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ వాదనలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది.

విజయ్ తో నాకు మంచి సన్నిహిత్యం ఉంది. నాకు ఇండస్ట్రీలో విజయ్ మంచి స్నేహితుడు. మా ఇద్దరిది మంచి జోడీ అందుకే మేము చేసే సీన్స్ బాగా వస్తున్నాయి. మా మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. దాంతో కొందరు మా మద్య ఏదో ఉందని ఊహించేసుకుంటున్నారు. వారు అలా అనుకునేలా మేము నటించినందుకు నటన పరంగా మేము సక్సెస్ అయినట్లే. నటన పరంగా మేమిద్దరం కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటాం. తాము నటించే సినిమాల్లో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం.

నేను నటించే ప్రతి సినిమా హీరోతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా నటించేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం కార్తీ మరియు మహేష్ తో సినిమాలు చేస్తున్నాను. వారితో కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా కష్టపడి నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇతర హీరోల మాదిరిగానే విజయ్ దేవరకొండ అంతకు మించి ఏమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చేసింది.