సౌందర్య రహస్యం బాహాటంగా చెప్పేసిన బ్యూటీ

Wed Aug 05 2020 14:00:03 GMT+0530 (IST)

Rashmika Mandanna reveals the secret of Her beauty

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న టాప్ స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాలను చేస్తోంది. ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో వచ్చింది. ఆ రెండు సినిమాలు సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాదిలో కనీసం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అలాంటిది కరోనా ఇయర్ గా ముద్రపడ్డ 2020 లో రష్మిక రెండు సినిమాలతో సక్సెస్ దక్కించుకోవడంతో పాటు ప్రస్తుతం పుష్ప వంటి భారీ పాన్ ఇండియా సినిమా చేతిలో ఉంది.తమిళంలో కూడా మంచి ఆఫర్లు ఈ అమ్మడికి ఉన్నాయి. అభినయం మరియు అందంతో అలరించే ఈ అమ్మడు ఇటీవల ఒకానొక సందర్బంలో తన సౌందర్య రహస్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను గతంలో ఇంత అందంగా ఉండేదాన్ని కాదు. నాకు ఎప్పుడు ఏదో ఒక చర్మ సమస్య ఉండేది. దాంతో చర్మ పాలిపోయినట్లుగా ఉండటంతో పాటు జీవం కోల్పోయినట్లుగా నా చర్మం కనిపించేది.

ఆ సమయంలో నేను చర్మంకు సంబధించిన పరీక్షలు చేయించగా నాకు స్కిన్ ఎలర్జీ ఉన్నట్లుగా గుర్తించారు. అప్పటి నుండి స్కిన్ ఎలర్జీ కి కారణం అయ్యే అన్ని ఆహారపు పదార్థాలను వదిలేశాను. అప్పడు వదిలేసిన ఆ ఆహార పదార్థాలు మళ్లీ ఇప్పటి వరకు ముట్టుకోలేదు. ఎంతో ఇష్టం అయిన కొన్ని డిషెష్ ను వదిలి పెట్టినందుకు ఇప్పటికి బాధగానే ఉంటుందని రష్మిక తన చర్మంకు సంబంధించిన రహస్యంను చెప్పుకొచ్చింది.