Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌కు బన్నీ- సుక్కు షాకిస్తున్నారా?

By:  Tupaki Desk   |   13 May 2022 2:30 AM GMT
ర‌ష్మిక‌కు బన్నీ- సుక్కు షాకిస్తున్నారా?
X
ర‌ష్మిక మంద‌న్న‌కు `పుష్ప‌` టీమ్ గ‌ట్టి షాక్ ఇవ్వ‌బోతోందా?.. త‌ను లైన్ లో వుండ‌గానే మ‌రో హీరోయిన్ ని రంగంలోకి దించ‌బోతోందా? అంటే అవున‌నే చెబుతున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. వివ‌రాల్లోకి వెళితే.. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో పాటు న‌టుడిగా అప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ ఒక లెక్క ఇప్ప‌టి నుంచి ఒక లెక్క అనే స్థాయిలో నిల‌బెట్టింది. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు మాత్ర‌మే ప‌నికి వ‌స్తాడ‌ని, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం లేద‌ని వినిపించిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిందీ సినిమా. ఇందులో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో చ‌ర‌ణ్ ప‌లికించిన అభిన‌యం విమ‌ర్శ‌కుల మ‌బ్బులిడిపోయేలా చేసింది.

ఇదే బ‌న్నీని `పుష్ప‌`లో న‌టించేలా చేసింది. త‌న‌కూ ఈ త‌ర‌హాలో చెప్పుకోద‌గ్గ క్యారెక్ట‌ర్ ప‌డాల‌ని ఎదురుచూసిన అల్లు అర్జున్ స‌రిగ్గా అలాంటి క‌థే త‌న‌ని సుకుమార్ రూపంలో వెతుక్కుంటూ రావ‌డంతో ఎగిరి గంతేసినంత ప‌ని చేశాడ‌ట బ‌న్నీ. డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ కావ‌డం.. ఆ క్యారెక్ట‌ర్ కే సెప‌రేట్ క్యారెక్ట‌ర్ వుండ‌టంతో ఫ‌లితం ఎలా వున్నా ఈ సినిమా చేయాల్సిందే అని ఫిక్స‌య్యార‌ట‌. అంతా ఫైన‌ల్ కావ‌డంతో అలా `పుష్ప‌` మూవీ ప‌ట్టాలెక్కింది.

ముందు పాన్ ఇండియా అని ప్ర‌చారం జ‌ర‌క్క‌పోయినా రిలీజ్ త‌రువాత ఈ మూవీ తిర‌గ‌రాసిని రికార్డుల మోత‌కి పాన్ ఇండియా స‌క్సెస్ గా అంతా గుర్తించారు. బాలీవుడ్ లో ఈ సినిమా సాధించిన వ‌సూళ్ల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చే మొద‌లైంది. తొలి రోజు బ‌న్నీ డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ చూసి కొంత పెద‌వి విరిచినా ఆ త‌రువాత అదే సినిమాకు ప్ర‌ధాన ప్ల‌స్ గా భావించి దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు `పుష్ప‌`కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాతో స‌రికొత్త లెక్క‌లు సెట్ చేసిన బ‌న్నీ దీనికి సీక్వెల్ గా చేయ‌నున్న `పుష్ప - 2` కోసం భారీ మార్పులే చేశార‌ట‌.

ముందు అనుకున్న ప్ర‌కారం పార్ట్ 2 ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే మొద‌లు పెట్టాల‌నుకున్నా ఇటీవ‌ల పాన్ ఇండియా సినిమాలు సాధిస్తున్న రికార్డ్స్‌, ప్రేక్ష‌కులు ఈ సినిమా నుంచి భారీ గా ఎక్స్ పెక్ట్ చేస్తున్న తీరుని గ‌మ‌నించిన సుకుమార్ గ‌త కొన్ని రోజులుగా `పుష్ప 2` స్క్రిప్ట్ లో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం యుఎస్ లో ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని రెడీ చేస్తున్న సుకుమార్ ఈ మూవీ లో చాలా మార్పులు చేశార‌ట‌. పార్ట్ 1 `పుష్ప ది రైజ్`ని మించి `పుష్ప ది రూల్‌` ని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట‌.

ఇప్ప‌టికే దీనికి సంబంధించిన బ‌డ్జెట్ ని కూడా భారీగానే పెంచేసిన సుకుమార్ ర‌ష్మిక మంద‌న్న‌కు షాక్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఫ‌స్ట్ పార్ట్ పెళ్లి సీన్ తో ఎండ్ అవుతుంది. పార్ట్ 2 లో పెళ్లి త‌రువాత హీరో, హీరోయిన్ ల మ‌ధ్య రొమాన్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ సీన్ ల‌కు పెద్ద‌గా స్కోప్ వుండ‌దు. ఆ కార‌ణంగానే సెకండ్ హీరోయిన్ ని రంగంలోకి దింపి స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశార‌ట‌. దీంతో మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా పార్ట్ 2 ని డిజైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఇంకా బ‌య‌టికి రాలేదు. టాప్ హీరోయిన్ మాత్రం వుండే అవ‌కాశం వుంద‌ని మాత్రం ఇన్ సైడ్ టాక్‌.