Begin typing your search above and press return to search.

ఇటీవల జరిగిన ఐటీ రైడ్స్ మీద రష్మిక క్లారిటీ

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:21 AM GMT
ఇటీవల జరిగిన ఐటీ రైడ్స్ మీద రష్మిక క్లారిటీ
X
రోటీన్ కు భిన్నంగా ఏం జరిగినా విశేషమే. అలాంటిదే తాజాగా జరిగింది. మీడియాతో మాట్లాడే నటీనటులు చాలానే విషయాలు చెప్పినట్లే చెబుతారు కానీ.. అవన్నీ వారు చెప్పాలనుకునే విషయాలే తప్పించి.. ఇంకేమీ ఉండవు. మిగిలిన రిపోర్టింగ్ లో లేని చిత్రమైన పరిమితి సినిమా రిపోర్టింగ్ లో ఉంటుంది. మిగిలిన చోట్ల రిపోర్టర్ ఏ ప్రశ్న వేయటానికైనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ..సినిమా రిపోర్టర్ మాత్రం అందుకు భిన్నంగా కొన్ని పరిమితులతో.. అనవసరమైన ఇబ్బందులకు గురి చేయకూడదన్న మాట అప్రకటితంగా ఉంటుంది.

ఒకవేళ అలా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే రిపోర్టర్ కు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి. దీంతో.. చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు అడగాలనుకొని కూడా అడగలేకుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా ఏ ప్రశ్నకు అయినా సమాధానం చెబుతానన్నట్లుగా ఉంటుంది రీల్ గీత రియల్ రష్మిక మందాడ.

వరుస చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె నటించిన భీష్మ ఈ వారమే విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ఆమె కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలాంటి సందర్భంగా ఇటీవల ఆమె ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ గురించి అడిగినంతనే.. ఇబ్బందికి గురి కాకుండా సమాధానాన్ని చెప్పేసింది.

సాధారణంగా ఐటీ తనిఖీలు లాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగి తమను ఇబ్బంది పెట్టొద్దని సినీ ప్రముఖులు చెబుతుంటారు. దీనికి భిన్నంగా రష్మిక మాత్రం.. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన తండ్రి వ్యాపార వేత్త అని.. తాను నటిని కావటంతో తమ ఇంట్లో క్యాజువల్ గా ఐటీ రైడ్స్ చేశారన్నారు. తనిఖీలు జరుగుతున్నాని తెలిసి తాను వెళ్లానని.. తమ ఇంట్లో ఏమీ దొరకలేదన్నారు. దీంతో.. ఐటీ అధికారులు వెళ్లి పోయినట్లు గా క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్లారిటీ ఇచ్చే వారు టాలీవుడ్ లో తక్కువ గా ఉంటారని చెప్పక తప్పదు.