Begin typing your search above and press return to search.

కో అంటే కోటీ.. కాసుల గలగలే.. రష్మిక ఆదాయం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Jan 2021 1:00 PM IST
కో అంటే కోటీ.. కాసుల గలగలే.. రష్మిక ఆదాయం ఎంతో తెలుసా?
X
దీపంలో నూనె చూసి అది ఎంతసేపటి వరకు వెలుగునిస్తుందో అంచనా వేయొచ్చు. కానీ.. సిల్వర్ స్క్రీన్ పై తారల వెలుగు చూసి, వారు ఎంతకాలం ప్రకాశిస్తారో చెప్పలేం. ఓవర్ నైట్లో స్టార్ అయిపోగలరు.. ఒక్కసినిమాతో ‘తెర’మరుగై పోనూగలరు. అందుకే.. వెలుగుతున్నప్పుడే అందరినీ వాడేస్తుంటారు సినీతారలు. ఇప్పుడు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా అదే పనిచేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే వినిపించే పేర్లలో ముందు వరసలో ఉంటుంది రష్మిక మందన్న. కొంతకాలంగా సీనియర్ నటీమణుల హవా తగ్గడంతో.. ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇతర హీరోయిన్స్ పోటీ ఇస్తున్నప్పటికీ.. ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఆదాయం విషయంలోనైతే ఈ నాలుగేళ్లలో రష్మిక ఎక్కడికో వెళ్లిపోయింది.

చేసిందల్లా హిట్టే..
కన్నడ ఇండస్ట్రీలో ఒక హిట్టు అందుకుందో లేదో టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించింది ఈ బ్యూటీ. ‘ఛలో’ సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. మధ్యమధ్యలో ఒకటీ అరా ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ.. మెజారిటీగా చేసిన ప్రతీ సినిమా హిట్టే అన్నట్టుగా మారిపోయింది కన్నడ బ్యూటీ ఫేట్.

ఇంతింతై..
ఇక రష్మిక మందన్న ఆదాయం విషయానికి వస్తే ఈ బ్యూటీ ఒక సినిమాకు రూ.2కోట్లకు తక్కువ తీసుకోవడం లేదని టాక్. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు కమర్షియల్ హిట్ గా నిలవడంతో సౌత్ లో ఈ అమ్మడి డిమాండ్ పెరిగింది. రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా.. ఇంతింతై అన్నట్టుగా పెంచుకుంటూ వెళ్తోంది.

కోట్ల రూపాయల ఆదాయం..
2016లో రష్మిక సంపాదన రూ.3కోట్లు మాత్రమేనని అంచనా. అంతకుముందు రూ.లక్షల్లోనే రెమ్యునరేషన్ అందుకునేది. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ పడడంతో ఆమె ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. 2017లో రూ.7కోట్లకు పెరిగిన ఆమె ఇన్ కమ్.. 2018లో రూ.9.50కోట్లకు చేరింది. ఆ తర్వాత రెమ్యునరేషన్ మరో స్థాయికి వెళ్లడంతో 2019లో రష్మిక ఆదాయం రూ.16కోట్లకు దగ్గరైందని టాక్.

యాడ్స్ ద్వారా కూడా..
కేవలం సినిమాల ద్వారానే కాకుండా.. ఇతర యాడ్స్ ద్వరా కూడా బాగానే ఆర్జిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. 2020 చివరి నాటికి మొత్తం ఆదాయం రూ.25కోట్లకు చేరిందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఈ భామ.. ‘పుష్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ప్రాజెక్టులు గనక హిట్టయితే రష్మిక రెమ్యునరేషన్ మరో స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు.