అనసూయకి అసూయ పుట్టిస్తున్న రష్మీ...!

Sat Jul 11 2020 11:15:58 GMT+0530 (IST)

Rashmi Dominates Anasuya

ప్రతీ రంగంలో పోటీ ఉన్నట్లే ప్రస్తుతం యాంకరింగ్ కెరీర్లో కూడా పోటీ బాగా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా ఫిమేల్ యాంకర్స్ బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు లేడీ యాంకర్ అంటే చాలా పద్ధతిగా.. గ్లామర్ షో చేయకుండా.. చీరలోనే కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాలంతో పాటు అవి కూడా మారిపోయాయి. ఇప్పుడు యాంకర్స్ అంటే హీరోయిన్ల కంటే ఎక్కువగా.. ఇంకా చెప్పాలంటే వాళ్లను డామినేట్ చేసేలా గ్లామర్ షో చేస్తున్నారు. అందరూ గ్లామర్ షో చేస్తున్నారంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ సాంప్రదాయబద్దంగా యాంకరింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ప్రెజెంట్ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న లేడీ యాంకర్స్ మధ్య పోటీ బాగా ఎక్కువైపోయింది. స్టార్ యాంకర్ అనిపించుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'జబర్ధస్త్' 'ఎక్స్ ట్రా జబర్ధస్త్' కామెడీ షోల ద్వారా అనసూయ - రష్మీ గౌతమ్ లు ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అనసూయ - రష్మీ గౌతమ్ బుల్లితెరపై పలు షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎంత ఒకే షో చేస్తున్నా వర్క్ పరంగా పోటీ అనేది ఉంటుంది కదా. వీరి మధ్య కూడా అలాంటి పోటీతత్వం పెరిగిపోయింది. ఈ క్రమంలో గ్లామర్ షో చేయడంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని ఫోటో షూట్స్ తో ప్రూవ్ చేసుకుంటూ సినిమాల్లోనూ ఛాన్సెస్ దక్కించుకుంటున్నారు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తమ హవా చూపిస్తూ వస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా అన్ని షోల షూటింగ్స్ తో పాటు ఈ యాంకరమ్మల  కామెడీ షోల షూటింగ్స్ కూడా నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో 'జబర్ధస్త్' 'ఎక్స్ ట్రా జబర్ధస్త్' ప్రోగ్రామ్స్ మళ్లీ పున: ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన రేటింగ్స్ అనసూయ భరద్వాజ్ ని షాక్ అయ్యేలా చేసాయి.

టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అనసూయ హోస్ట్ చేసే 'జబర్ధస్త్' ప్రోగ్రామ్ కంటే రష్మీ గౌతమ్ హోస్ట్ చేసే 'ఎక్స్ ట్రా జబర్ధస్త్'కు ఎక్కువ టీఆర్పీలు వచ్చాయి. గత రెండు వారాలుగా అనసూయ ప్రోగ్రామ్ కంటే రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీఆర్పీలు తెచ్చుకోవడం విశేషం. లాక్ డౌన్ కి ముందు వరకూ రష్మీ షో కంటే అనసూయ షోకి ఎక్కువ రేటింగ్స్ వచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. దీనికి అనసూయ తన ఫిట్ నెస్ కోల్పోవడమే కాకుండా ఇప్పుడు షోలో తన లుక్స్ పెద్దగా ఎట్రాక్టీవ్ గా లేవనే కామెంట్స్ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అటు రష్మీ గౌతమ్ కి మాత్రం ఫుల్ లైక్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోగ్రామ్ థీమ్ ఒకటే అయినా రేటింగ్స్ విషయంలో మాత్రం రష్మీ 'ఎక్స్ ట్రా జబర్ధస్త్' ప్రోగ్రామ్ చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది. మరి రష్మి గౌతమ్ ఎక్స్ ట్రా దూకుడుని అనసూయ ముందు రోజుల్లో క్రాస్ చేస్తుందేమో చూడాలి.