మెగా మూవీ టిక్ టాక్ ప్రమోషన్ అదిరింది

Sun Dec 08 2019 12:34:37 GMT+0530 (IST)

Rashi Khanna irritates Mega Hero with Tik Tok videos

సాయి ధరమ్ తేజ్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా రూపొందిన 'ప్రతిరోజు పండుగే' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టిక్ టాక్ సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఫేస్ బుక్ కంటే కూడా అధికంగా టిక్ టాక్ ప్రస్తుతం జనాల్లో ఆధరణ దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. అందుకే ప్రతి రోజు పండుగే సినిమా ప్రమోషన్ కోసం టిక్ టాక్ ను వేదికగా చేసుకున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా టిక్ టాక్ వీడియోలు విచ్చలవిడిగా చేస్తూ ఉంటుంది. రోజులో ఎక్కువ శాతం టిక్ టాక్ వీడియోల కోసమే ఆమె కేటాయిస్తూ ఉంటుంది. ట్రైలర్ లో ఇప్పటికే రాశిఖన్నా టిక్ టాక్ వీడియోలు ఎలా ఉండబోతున్నాయో చూశాం. ఇప్పుడు టిక్ టాక్ లో రాశిఖన్నా సందడి చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగు టిక్ టాక్ స్టార్స్ తో రాశిఖన్నా కొలాబరేట్ అయ్యి వీడియోలు చేస్తోంది.

టిక్ టాక్ లో మంచి గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిలు మరియు అబ్బాయిలతో కలిసి రాశిఖన్నా పదుల సంఖ్యలో వీడియోలు చేసింది. దాంతో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు ప్రతి రోజు పండుగే సినిమాకు మస్త్ పబ్లిసిటీ దక్కుతోంది. మారుతి ప్లాన్ తో ఈజీగా ఫ్రీగా సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ అవుతుంది. ఇప్పటికే ప్రతిరోజు పండుగే సినిమాపై జనాల్లో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి మరింతగా పెంచేట్లుగా ప్రమోషన్స్ ఉన్నాయి. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించాడు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది.