ఫొటోటాక్ : హద్దులు లేని అందాల రాశి ఆరబోత

Sat Jan 15 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Rashi Khanna Latest Photo

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. మొదటి సినిమా తో బొద్దుగా కనిపించి ముద్దుగుమ్మ అనిపించుకుంది. ఆ తర్వాత తర్వాత బరువు తగ్గి సన్నబడింది. బొద్దుగుమ్మ అయినా ముద్దుగుమ్మ అయినా కూడా ఒకటే అన్నట్లుగా ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు.. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తుంది. తమిళంలో ఈ అమ్మడి జర్నీ బాగుంది. అక్కడ భారీ చిత్రాలు చేస్తూ దూసుకు పోతుంది. తెలుగు లో ఈ అమ్మడు మెల్ల మెల్లగా స్టార్స్ కు జోడీగా ఆఫర్లు దక్కించుకుంటుంది.ఒక వైపు సినిమాల్లో కుమ్మేస్తూ మరో వైపు ఆకట్టుకునే అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఈ అమ్మడి సోషల్ మీడియా అందాల ఆరబోత ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటో షూట్ వైరల్ అవుతోంది. పరువాల వింధు కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. షర్ట్ బటన్ తీసి మరీ అందాల వింధు చేస్తున్న రాశి ఖన్నాను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

మొదటి సినిమా తోనే మల్టీ ట్యాలెంటెడ్ అంటూ నిరూపించుకుంది. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పడం మొదలుకుని ఎన్నో రకాలుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఆకట్టుకుంటూనే ఉంది. తమిళంలో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా మారిన ఈమె మెల్ల మెల్లగా బాలీవుడ్ బాట పడుతోంది. ఆకట్టుకునే రూపం తో పాటు ప్రతిభ ఉండటం వల్ల ఈమె ఎక్కడకు వెళ్లినా కూడా అదే జోరు కంటిన్యూ చేస్తుంది. తెలుగు లో ముందు ముందు ఈమె స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి.