రాశీ ఖన్నా కామెడీ క్లిక్ అవుతుందా ?

Sun Nov 17 2019 08:46:58 GMT+0530 (IST)

Rashi Khanna Comedy Role in Prathi Roju Pandage

మారుతి సినిమాలో హీరో - హీరోయిన్ కి ఓ స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్ట రైజేషన్ తోనే ప్రేక్షకులను ఆధ్యంతం నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ప్రతి రోజు పండగే' లో కూడా రాశి ఖన్నా కోసం అలాంటి స్పెషల్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడట మారుతి.సినిమా లో రాశి టిక్ టాక్ కి విపరీతంగా ఎడిక్ట్ అయిన పల్లెటూరి అమ్మాయి గా కనిపించనుందట. సినిమాలో రాశి టిక్ టాక్ సన్నివేశాలు భలే కామెడీ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సుప్రీమ్ లో రాశి రోల్ లో ఎంత ఫన్ ఉంటుందో ఈ రోల్ లో కూడా అంతే ఉంటుందని అంటున్నారు. రాశి కామెడీ థియేటర్స్ లో బాగా పెళుతుందనే నమ్మకంతో ఉన్నారట మారుతి అండ్ టీమ్.

ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాత- మనవడి బాండింగ్ మీదే ఎక్కువగా నడుస్తుందట. చివర్లో ఆస్తి పంపకాలు లాంటి సన్నివేశంతో ఏదో ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుందని సమాచారం. ఇదంతా రొటీనే కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి సినిమాలో తన మార్క్ కామెడీ నే నమ్ముకుంటున్నాడట మారుతి. మరి ఈసారైనా మారుతి సక్సెస్ అందుకుంటాడో లేదో ?