IMDb జాబితాలో SRK తో రాశి ఖన్నా ..ఎలా సాధ్యం?

Sat Apr 01 2023 16:10:51 GMT+0530 (India Standard Time)

Rashi Khanna Appearing One Step Above On Shahrukh On IMDb List

రాశీఖన్నా పరిచయం అవసరం లేదు. తెలుగు-తమిళం సహా హిందీ పరిశ్రమలోను అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి ఇప్పటివరకూ అసాధారణ స్టార్ డమ్ ని ఛేజిక్కించుకోవడం సాధ్యపడలేదనే చెప్పాలి. అయితే అనూహ్యంగా ఐఎండిబి జాబితాలో కింగ్ ఖాన్ షారూఖ్ కంటే ఒక మెట్టు పైన కనిపించి రాశీ షాకిచ్చింది.షాహిద్ కపూర్ -విజయ్ సేతుపతి లాంటి క్రేజీ స్టార్లు నటించిన `ఫర్జీ`లో నటనకు రాశి ఖన్నా మంచి ప్రశంసలు అందుకుంది. సిరీస్ సక్సెస్ సాధించిన క్రమంలో రాశీ గురించి యువతరం ముచ్చటించుకుంది. ఫర్జీ విజయంతో దిల్లీ బ్యూటీ రాశీ పేరు మార్మోగింది. ఈ వెబ్ సిరీస్ లో చక్కని నటనతో ఆకట్టుకుంది. షాహిద్ కపూర్ - విజయ్ సేతుపతి వంటి ఇద్దరు టాప్ పెర్ఫార్మర్స్ తో కలిసి నటించడం అంత తేలికైన పని కాదు. సాహసంతో కూడుకున్నది. కానీ రాశి తన పనిని సజావుగా సాగించి నిరూపించుకుంది.

ఇటీవల విడుదల చేసిన IMDb టాప్ స్టార్ల జాబితాలో షారూఖ్ ఖాన్ కంటే ఉన్నత స్థానాన్ని రాశీఖన్నా కైవశం చేసుకుంది. ఇది కలనా ?? అనే శీర్షికతో వార్తల్లో ప్రముఖురాలైంది. దీని గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ఈ విషయం తెలియగానే నేను మరొక గదికి పరిగెత్తి మా నాన్నకు ఫోన్ చేసాను.

లిస్ట్ ఏమిటో అతనికి అర్థం కాలేదు.. కానీ SRK సార్ ఏ స్థానంలో ఉన్నారో ఏమో. నేను రెండో స్థానం. అతను(నాన్న) కూడా షాక్ అయ్యాడు. నిజాయితీగా చెప్పాలంటే.. ఇది బూటకమని నేను అనుకున్నాను. కానీ తర్వాత ఇది కేవలం ఒక దశ మాత్రమేనని గ్రహించాను. అతడు కింగ్ ఖాన్ .. అతడిని ఎవరూ ఓడించలేరు. ఇది షోకి దక్కిన ప్రజాదరణ. నా పాత్ర నచ్చింది. కానీ నేను నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను. నాలో ఉన్న ఉరకలెత్తే రక్తం నిజంగా ఉత్సాహంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఇదొక మైలురాయి అనుభవం.. అని అంది.

అయితే షారూఖ్ తో రాశీఖన్నాను పోల్చడం సరికాదు. ఇది రాశీ ఎంపిక చేసుకున్న షో వల్ల సాధ్యమైనది. రాశీ కెరీర్ లో ఉత్తమమైన ఎంపిక అని కూడా భావించాలి. రాశీ ఎంత గొప్పగా నటించిన షారూఖ్ అసాధారణ నటుడు. అతడు భారతదేశంలోనే కింగ్ ఖాన్. అసాధారణ ప్రతిభావంతుడు. ఐఎండిబి సీజనల్ గా స్టార్లు నటించిన సినిమాలు షోలకు దక్కిన క్రేజ్ ఆధారంగా నటీనటుల ర్యాంకింగులను ప్రకటిస్తుంది. ఈ ర్యాంకింగులు అన్ని సీజన్లకు వర్తించవు. ఇవి ప్రతియేటా మారుతూనే ఉంటాయి.

రాశి ఖన్నా ప్రధానంగా తెలుగు - తమిళ చిత్రాలలో నటించింది. 2013లో జాన్ అబ్రహం- నర్గీస్ ఫక్రీ నటించిన మద్రాస్ కేఫ్ చిత్రంతో నటిగా వృత్తిని ప్రారంభించింది. రుద్ర - ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ తో OTT స్పేస్ లో ప్రవేశించింది. ఈ సంవత్సరం ఫర్జీలో మేఘగా వెబ్ స్పేస్ ను పరిపాలించింది. ఇందులో షాహిద్ కపూర్ -విజయ్ సేతుపతి కూడా నటించారు. 2023లో రాశీ నటించిన రెండు సౌత్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.