ఉగాది షడ్రుచులు ఏ హీరో సొంతం!

Wed Mar 22 2023 12:00:00 GMT+0530 (India Standard Time)

Rangamarthanda or Dhamki Success on Ugadi

ఉగాది సందర్భంగా 'రంగమార్తాండ'-'దాస్ కా దమ్కీ' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లో షోలు నడుస్తున్నాయి. ఏ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఉగాది షడ్రులు ఏ హీరో సొంతం చేసుకుంటారు?  లేక అదే తీపి..పులును హీరోలిద్దరు  సమానాంగా పంచుకుంటారా?  అన్నది పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.



ఇక  ఆ రెండు సినిమాలపై ఉన్న బజ్ ని ఓసారి చెక్ చేస్తే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.  క్రియేటివ్ మేకర్ కృష్ణవంశీ తెరకెక్కించిన  'రంగమార్తాండ' ఇప్పటికే సెలబ్రిటీలకు వేసిన షోతో! సగం సక్సెస్ అయింది. సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన చిత్రంగా ప్రచారం పొందుతుంది. విమర్శకులు సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది.

కృష్ణవంశీకి కూడా ఈ సినిమా అంతే కీలకం. ఇప్పటికే అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.  ఈసినిమా విజయం సాధించకపోతే! ఆయన మరింత ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రంగమార్తాండ కి వస్తోన్న టాక్ తో వంశీ గట్టెక్కినట్లే తెలుస్తుంది. ఇక కమర్శియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో సినిమా 'దాస్ కా ధమ్కీ'. విశ్వక్ సేన్  స్వీయా దర్శకత్వం వహిస్తోన్న సినిమాకి తొలి నుంచి పాజిటివ్ బజ్ ఉంది.

విశ్వక్ ఎనర్జీ...యూత్ లో ఉన్న క్రేజ్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ వైబ్ ఆరంభం నుంచే క్రియేట్ అయింది. దీనికితోడు   సినిమాని తొలి నుంచి పెద్ద హీరోలతో ప్రమోట్ చేయించారు.  

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో కోట్ల రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే దక్కింది. అంతకు ముందు రామ్ చరణ్...వెంకటేష్ లాంటి స్టార్లు  సినిమాకి అవసరమైన బూస్టింగ్ ఇచ్చారు. ఇలా అన్ని సమీకరణాలు 'దాస్ దా ధమ్కీ' పై అంచనాలు పెంచాయి. మరి అంతిమంగా ఎవరు ఎలాంటి ఫలితాలు సాధిస్తారు? అన్నది చూడాలి.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.