రంగమార్తాండ.. బూస్ట్ ఇచ్చిన బలగం!

Fri Mar 17 2023 14:04:16 GMT+0530 (India Standard Time)

Rangamarthanda got some boost after Balagam Hit

నక్షత్రం డిజాస్టర్ తో కృష్ణవంశీ చాలా కాలం పాటు సైలెంట్ అయిపోయారు ఏంటి... ఇక ఆయన సినిమాలు చేయడం మానేస్తారా అని కూడా కొందరు వార్తలు రాశారు. సరిగ్గా అలాంటి తరుణంలోనే ఆయన రంగమార్తాండ అనే ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టుగా ప్రకటించారు. మరాఠీలో సూపర్ హిట్ గా నిలిచిన నట సామ్రాట్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా సిద్ధం చేశారు. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ బ్రహ్మానందం రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక అనసూయ ఆదర్శ బాలకృష్ణ వేణు వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి.దానికి ముఖ్య కారణం ఇది కృష్ణవంశీ మార్క్ సినిమా కావడం ఇళయరాజా సంగీతం అందించడం లేట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి పాటలు రాసిన సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో బలగం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో కృష్ణవంశీకి కొంత బలం వచ్చినట్లు తెలుస్తోంది. బలగం ఎమోషన్ జనాలకు బాగా కనెక్ట్ అయిందని కంటెంట్ నచ్చితే చిన్న సినిమా అయినా హిట్ అవుతుందనే హోప్ దొరకడంతో ఆయన తనదైన శైలిలో మార్కెటింగ్ చేస్తున్నారని అంటున్నారు.

అందుకే టాలీవుడ్ దర్శకులు సినీ నటులు మీడియా ప్రతినిధులకు స్పెషల్ షోలు వేసి వారి స్పందన తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా సినిమాకి అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ముందుకు వెళ్లి సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చ్ 22వ తేదీన ఉగాది సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సరిగ్గా అదే సమయానికి విశ్వక్ సేన్ హీరోగా లభిస్తున్న దాస్ కా దమ్కీ సినిమా రిలీజ్ అవుతున్నా సరే తన ఆడియన్స్ తనకు ఉంటారని ధైర్యంతో కృష్ణవంశీ ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. అంటే ఒక రకంగా బలగం కృష్ణవంశీకి బలం ఇచ్చిందని దానికి తోడు మీడియా షోలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఆయనకి మంచి ఊతో ఇస్తుందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.