రంగామర్తాండ.. మైత్రి రేటు ఎంతంటే?

Sat Mar 18 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Rangamarthanda.. What is the rate of Mythri Movie Makers ?

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ జోడీగా రంగామార్తాండ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బెంగాలీ మూవీ నట సామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీని దర్శకుడు కృష్ణవంశీ గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో దర్శకులు అందరితో ఈ సినిమా గురించి చెప్పిస్తున్నారు. ప్రత్యేకంగా అందరికి స్క్రీనింగ్ వేసి మరి మూవీని కృష్ణ వంశీ మార్కెట్ చేస్తూ ఉండటం విశేషం.ఈ నేపధ్యంలో సినిమాపై కొంత అంచనాలు పెరిగాయని చెప్పాలి. కృష్ణవంశీ చివరిగా నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో సుదీర్ఘ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రంగామర్తాండ సినిమాతో వస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంప్లీట్ థీయాట్రికల్ రైట్స్ ని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

మొత్తం తమ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేయడానికి 4 కోట్లకి రైట్స్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాత సంస్థ రంగామార్తండ సినిమా రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంది అంటే కచ్చితంగా గ్రాండ్ గానే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని సెలబ్రిటీలు అందరూ ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో మౌత్ టాక్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

 కృష్ణవంశీ నుంచి ఒక ఖడ్గం అంతపురం తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులకి ఈ మూవీ కనెక్ట్ అవుతుందనే మాట వినిపిస్తుంది. మరి కృష్ణవంశీకి ఈ మూవీ సక్సెస్ ఇస్తే మాత్రం మళ్ళీ అతను కెరియర్ పరంగా ట్రాక్ ఎక్కినట్లే అని ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇక రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటం కూడా మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.