క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుండి వచ్చిన మూవీ రంగమార్తాండ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరాఠీలో విజయం అందుకున్న నట సామ్రాట్ మూవీకి ఇది అఫీషియల్ రీమేక్. నక్షత్రం సినిమా డిజాస్టర్ తర్వాత కృష్ణవంశీ చాలా కాలం గ్యాప్ తీసుకుని మరీ తెరకెక్కించిన రీమేక్ మూవీ రంగమార్తాండ. ఈ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లో నడుస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంత చేసుకున్నట్లు తెలుస్తోంది.
దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ రంగమార్తాండను సొం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి 4 వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారట మూవీ మేకర్స్. సినిమా కోసం పెట్టిన బడ్జెట్ లో 90 శాతం వరకు రికవరీ అయ్యేలా ఓటీటీ డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఇప్పటికే సినిమా మిక్స్డ్ టాక్తో నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంతలో కొంత కలెక్షన్లు అందుకున్న నిర్మాతలు సేఫ్ అయినట్లేనని అంటున్నారు. రంగమార్తాండ సినిమా రిలీజ్ కు ముందు బయ్యర్లు దొరక్క ఇబ్బందులు పడ్డ నిర్మాతలు ఇప్పుడు మంచి రేట్ అందడం పట్ల సంతోషంగా ఉన్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
నట సామ్రాట్ సినిమాలో నానా పటేకర్ పోషించిన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు. ప్రకాశ్ రాజ్ భార్య పాత్రలో రమ్యకృష్ణ స్నేహితుడిగా బ్రహ్మానందం నటించగా.. ఇందులో శివాత్మిక రాజశేఖర్ రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శ్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందించారు.
రంగస్థల నటుడు నటన నుండి రిటైర్ అయ్యాక ఆస్తులన్నీ కొడుకు కూతుర్లకు పంచి ఇచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో రంగమార్తాండ తెరకెక్కింది. రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానంద నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిగతా వారు కూడా పరిధి మేర చక్కగా నటించారని విశ్లేషకులు చెబుతున్నారు. నటన కథ ఈ సినిమాకు ప్లజ్ పాయింట్లు కాగా కథనం కొద్దిగా స్లోగా ఉందని రివ్యూవర్లు రాసుకొచ్చారు.