Begin typing your search above and press return to search.

#రంగ్ దే.. చెడు చూడకు.. చెడు వినకు.. చెడు మాట్లాడకు!

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 AM GMT
#రంగ్ దే.. చెడు చూడకు.. చెడు వినకు.. చెడు మాట్లాడకు!
X
చెడు చూడకు.. చెడు వినకు.. చెడు మాట్లాడకు!.. ఇలాంటి అద్భుత‌ సందేశం ఇస్తోంది ఎవ‌రో చూశారు క‌దా? `రంగ్ దే` టీమ్. నితిన్ నోటికి తాళం వేస్తే.. కీర్తి చెవుల‌కు లాక్ వేసింది. ద‌ర్శ‌కుడు వెంకీ ఏకంగా క‌ళ్లు మూసుకున్నాడు. అయినా అంత‌టి ఘోరం అక్క‌డ ఏం జ‌రిగింద‌ని ఇంత‌గా రియాక్ట‌వుతున్నారు?

ఒక‌వేళ తెలియాలంటే రంగ్ దే చూడ‌మంటారా? ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉంది అంటూ నితిన్ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న `రంగ్ దే` మార్చి 26 న విడుదల కానుంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా ఈ సినిమా రిలీజ్ తేదీని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

నితిన్ - కీర్తి జోడీ రొమాన్స్.. దేవి శ్రీ ప్రసాద్ పాట‌లు ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానున్నాయి. టాకీ చిత్రీక‌ర‌ణ ఇంత‌కుముందు ముగించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఇక భీష్మ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రో పెద్ద హిట్ కొట్టాల‌న్న పంతంతో ఉన్నాడు నితిన్.