ప్రమాదం నుంచి బయటపడిన రణ్‌బీర్

Sat Jun 25 2022 17:00:01 GMT+0530 (IST)

Ranbir survived the accident

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల కాలంలో చాలా బిజీబిజీగా కనిపిస్తున్నాడు. ఏ మాత్రం రెస్ట్ లేకుండా ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు వరుస సినిమా ప్రమోషన్స్ తో చలాకీగా కనిపిస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే మరోవైపు షంషేరా సినిమా ప్రమోషన్ లో కూడా బిజీ అయ్యాడు. జూలై 22వ తేదీన రానున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల ముంబై లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ వేడుకలో రణ్‌బీర్ కపూర్ చాలా ఆలస్యంగా హాజరయ్యాడు. అందుకు కారణం అతను వచ్చే దారిలో ఒక ప్రమాదానికి గురయ్యాడట.

అసలైతే అందరికంటే ముందే ఇక్కడికి రావాల్సిన వాన్ని అంటూ కాకపోతే మార్గం మధ్యలో ఒక వ్యక్తి మా కారును ఢీకొట్టడంతో కారు అద్దాలు మొత్తం పగిలిపోయాయి.

అదృష్టవశాత్తూ ఏమి కాలేదు అని రణ్‌బీర్ కపూర్ తెలియజేశాడు. ఇక షంషేరా సినిమాకు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ఇక వార్ బ్యూటీ వాణి కపూర్ ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటించింది.

విడుదలైన షంషేరా ట్రైలట్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకొని ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో సక్సెస్ అందుకోవాలని రణ్‌బీర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

బ్రహ్మాస్త్ర సినిమాతో రణ్‌బీర్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి తన సమర్పణలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మరి మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర  బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.