Begin typing your search above and press return to search.

లెక్చరర్ గా రణబీర్ కపూర్.. 'యానిమల్' వీడియో లీక్

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
లెక్చరర్ గా రణబీర్ కపూర్.. యానిమల్ వీడియో లీక్
X
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ తెలుగులో ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. ఇదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్పే రుతో రీమేక్ చేసి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలు పట్టేశాడు సందీప్. ప్రస్తుతం సందీప్ వంగ రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాను పాన్ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. హిందీతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.యానిమల్ చిత్రాన్ని 11 ఆగస్టు 2024 పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా కేవలం టైటిల్, రణబీర్ ఫస్ట్ లుక్, షూటింగ్ నుంచి లీక్ అయిన రణబీర్ పిక్స్ తోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది.

తాజా విషయం ఏంటంటే... ఈ మూవీ సెట్స్ నుండి తాజాగా ఒక వీడియో ఆన్‌ లైన్‌ లో లీక్ అయింది. దీంతో అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రణబీర్‌ లెక్చరర్‌గా కనిపించారు. అలానే ఈ వీడియోలో ఆయన లుక్‌ చూసిన పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరో సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌ గా చేస్తోంది. ఇప్పటికే సౌత్‌లో ఫుల్ పాపులారిటీ పెంచుకున్న రష్మిక.. ఈ సినిమాకు మరో అదనపు బలంగా మారనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళీ పిక్చర్స, సినీ 1 స్టూడియోస్ పతాకంపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.