యానిమాల్ బిగ్ బడ్జెట్.. యాక్షన్ కోసం భారీగా..

Sun Jan 29 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Ranbir Kapoor Animal Budget

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తన మొదటి సినిమా కోసం బోల్డ్ లవ్ స్టొరీని ఎంచుకుంటే ఇప్పుడు బాలీవుడ్ లో చేయబోతున్న మూడో సినిమా కోసం పవర్ ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశం ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా హిందీలో తెరకెక్కించి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏకంగా 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సౌత్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్ తర్వాత మాఫియా బ్యాక్ డ్రాప్ కథలకి డిమాండ్ భాగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే రణబీర్ కపూర్ తో కంప్లీట్ మాఫియా బ్యాక్ డ్రాప్ స్టొరీతో యానిమల్ సినిమాని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో స్టార్ట్ అయ్యింది. ఇక భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి సత్తా చాటాలని సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్యాంగ్ స్టార్ పాత్రలో రణబీర్ కపూర్ గెడ్డం లుక్ లో ఈ విజువల్స్ లో కనిపిస్తున్నాడు.

బ్లాక్ కార్ల కాన్వాయ్ తో ఎవరి మీదకో తన టీమ్ తో కలిసి ఎటాక్ కి వెళ్ళిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. రణబీర్ కపూర్ సిగరెట్ తాగుతూ ఉండగా అతని అనుచరుచు వచ్చి గన్ తీసుకొని వెళ్ళడం అదే సమయంలో రణబీర్ కపూర్ ముందుకి కదలడం. అతని చుట్టూ గ్యాంగ్ మొత్తం సెక్యూరిటీ టైప్ లో గ్రూప్ గా ముందుకి కదలడం ఆ లీకైన విజువల్స్ లో కనిపిస్తుంది. ఈ విజువల్స్ ఆధారంగా రణబీర్ కపూర్ కెరియర్ గ్యాంగ్ స్టార్ పాత్రలో చేస్తున్న మొదటి సినిమా యానిమల్ అని తెలుస్తుంది.

 ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 60 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి మాఫియా బ్యాక్ డ్రాప్ కథలు కొత్త అయితే కాదు. కాని వింటేజ్ నేరేషన్ తో పవర్ ఫుల్ ఎలివేషన్స్ తో తెరకెక్కిస్తే మాత్రం కేజీఎఫ్ కి బ్రహ్మరథం పట్టినట్లు పడతారు. మరి యాక్షన్ సీక్వెన్స్ కోసం సందీప్ పెడుతున్న బడ్జెట్ చూస్తుంటే గట్టిగానే ఎలివేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మాస్త్రతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రణబీర్ కపూర్ యానిమల్ తో మరో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.