రానా నాయుడు.. తెలుగు వెర్షన్ లేపేశారుగా!

Thu Mar 30 2023 09:31:45 GMT+0530 (India Standard Time)

RanaNaidu Telugu Version Has been Removed

విక్టరీ వెంకటేష్ రానా కాంబినేషన్ లో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ రెండు వారాల క్రితం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తండ్రి కొడుకుల కథాంశం గా ఈ వెబ్ సిరీస్ ని ఆవిష్కరించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం వెంకటేష్ రాణా ప్రమోషన్ చేస్తున్న సమయంలో నే ఫ్యామిలీ తో కలిసి చూడొద్దు అని పదేపదే చెప్పేవారు.ఇందులో ఎక్కువ గా బూతు సంభాషణలు ఉండటం దీని కి ప్రధాన కారణమని చెప్పాలి. ఇక వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రేక్షకులు పెద్ద గా సంతృప్తి చెందలేదు. కంటెంట్ పరం గా ఓకే అనుకున్న శ్రుతిమించిన  బూతు సంభాషణలు వెబ్ సిరీస్ పై నెగిటివ్ టాక్ తీసుకువచ్చాయి. విక్టరీ వెంకటేష్ ఇంతవరకు బిల్డ్ చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా రానా నాయుడు కారణం గా దెబ్బతింది అనే విమర్శలు వచ్చాయి.

వెంకట్ వెంకటేష్ అభిమానించే ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక కొంతమంది సెలబ్రిటీ ప్రముఖుల కు కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కథను చెప్పడాని కి బూత్ డైలాగులు వాడాల్సిన అవసరం ఏముంది అంటూ విమర్శించారు. విజయ శాంతి లాంటి రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఏకం గా వార్నింగ్ ఇవ్వడం విశేషం.

ఇలా అన్ని వైపుల నుంచి రానా నాయుడు వెబ్ సిరీస్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఉన్నపలంగా రానా నాయుడు తెలుగు వెర్షన్ వెబ్ సిరీస్ ని తొలగించారు. అయితే హిందీ వెర్షన్ మాత్రం అలాగే ఉంది. అభిమానులు రెగ్యులర్ ఆడియన్స్ నుంచి వస్తున్న నెగిటివ్ టాక్ కారణంగానే తెలుగు వెర్షన్ వెబ్ సిరీస్ ని తొలగించినట్లుగా తెలుస్తుంది.

అయితే సర్వర్ ఇష్యూ వలన తొలగించి ఉంటారని కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరోసారి డబ్బింగ్ చేయించి బూతు సంభాషణలు అన్ని తొలగించి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా బోగట్టా. మరి దీనిపై నెట్ ఫ్లిక్స్ నుంచి ఇంత వరకు క్లారిటీ లేకపోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.