హిందీ యాంకర్ షాక్ ఇచ్చిన రానా.. 5 ఏళ్ల తర్వాత టిట్ ఫర్ టాట్

Fri Dec 02 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Rana talk about south movies with hindi anchor

ఒకప్పుడు సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు మరియు బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సౌత్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా విడుదలకు ఉంది అంటే చాలా హడావిడి ముంబయిలో మొదలవుతుంది. అక్కడ బేరసారాలు సాగుతున్నాయి.తాజాగా ఈ విషయమై రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయిదు సంవత్సరాల క్రితం ఒక హిందీ యాంకర్ సౌత్ సినిమా.. తెలుగు సినిమా ఏం చూస్తాం అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ యాంకర్ ఇప్పుడు ఒక కార్యక్రమం సందర్భంగా రానాతో మాట్లాడించాడు. అప్పుడు రానా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా అయిదు ఏళ్ల క్రితం మాటకు సరైన సమాధానం ఇచ్చాడు.

మీరు అయిదు సంవత్సరాల క్రితం సౌత్ సినిమా.. తెలుగు సినిమా ఏముంది లే చూడటం అన్నారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాల వెంట పరుగులు తీస్తున్నారు. సౌత్ సినిమా విడుదల అయ్యింది అంటే చాలా ఉత్తరాదిన థియేటర్లకు పరుగులు తీస్తున్నారు అంటూ రానా ఆ యాంకర్ తో నేరుగా అన్నాడు. అప్పుడు ఆ యాంకర్ మొహం చూడాలి మాడి పోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. రానా భలే సమాధానం ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రానా గతంలో కూడా సౌత్ సినిమాల గురించి మన తెలుగు సినిమాల గురించి తక్కువ చేసిన వారికి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మరో వీడియో వైరల్ అవుతూ ఉండటంతో ఆయనపై మరింత గౌరవం పెరుగుతుందని తెలుగు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.