Begin typing your search above and press return to search.

స‌లార్-ఆదిపురుష్ కాదు బాహుబ‌లి- RRRని కొట్టేది!?

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 AM GMT
స‌లార్-ఆదిపురుష్ కాదు బాహుబ‌లి- RRRని కొట్టేది!?
X
డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస‌ గా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నారు. అత‌డు న‌టించిన ఆదిపురుష్ 3డి ట్రైల‌ర్ ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌ను పెంచింది. ఈ సినిమా ని ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో విడుద‌ల‌ కు వ‌స్తున్న ఈ సినిమా బాహుబ‌లి 2 డే వ‌న్ రికార్డుల‌ ను బ్రేక్ చేస్తుందా? అన్న‌ చ‌ర్చ సాగుతోంది. అయితే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీ లో చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లి ఫ్రాంఛైజీ - ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌ ను అధిగ‌మించే మ‌రో సినిమా ఏది? అంటూ ఒక ప్ర‌ధాన‌మైన చ‌ర్చ ఇప్పుడు తెర‌ పైకొచ్చింది.

మ‌రోసారి ప్ర‌భాస్ త‌న సినిమాల రికార్డుల‌ ను తానే తిర‌గ రాస్తాడా? ఇండియన్ జేమ్స్ కామెరూన్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సినిమాల రికార్డుల‌ ను తిర‌గ రాస్తాడా? అంటూ చ‌ర్చ సాగుతోంది. అయితే దీనికి స‌రైన స‌మాధానం భ‌ళ్లాల‌దేవ రానా నుంచి అనూహ్యంగా బ‌య‌ట‌ప‌డింది. భవిష్య‌త్ లో RRR- బాహుబలి సినిమాల్ని కొట్టే మ‌రో సినిమా వ‌స్తోంద‌ని రానా ఇండియా టుడే కాన్ క్లేవ్ లో వ్యాఖ్యానించారు. తాను నిజంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్ర‌మిద‌ని తెలిపాడు. టాలీవుడ్ లో ఒక‌రి సినిమా ఘ‌న‌విజ‌యాన్ని ఇంకొక‌రం ఎంతో బాగా సెల‌బ్రేట్ చేసుకుంటాం. "ప్ర‌భాస్-అమితాబ్- దీపిక ప్ర‌ధాన తారాగ‌ణంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కే' గ్లోబ‌ల్ స్థాయి లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. స‌రిహ‌ద్దుల‌ ను చెరిపేసి రికార్డుల‌ను బ్రేక్ చేసే అర్హ‌త ఉన్న సినిమా ఇది. ఇది తెలుగు నుంచి ప్ర‌పంచ స్థాయి సినిమా అవుతుంది. టాలీవుడ్ స్థాయిని అనూహ్యంగా పెంచుతుంది" అని అన్నారు.

ప్ర‌స్తుతం ద‌క్షిణాది స‌హా ఉత్త‌రాదినా పుష్ప 2 (బ‌న్ని) గురించి స‌లార్ (ప్ర‌భాస్) గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ఆదిపురుష్ 3డి పై మిశ్ర‌మ స్పంద‌న‌లు ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్ కే గురించి అంత విస్త్ర‌త‌మైన చ‌ర్చ అయితే జ‌ర‌గ‌డం లేదు. కానీ రానా ఆదిపురుష్ గురించి కానీ స‌లార్ గురించి కానీ ప్ర‌స్థావించ‌కుండా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె గురించి ఇండియా టుడే కాన్ క్లేవ్ లో ప్ర‌స్థావించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నిజానికి అత‌డి న‌మ్మ‌కం నిజ‌మైతే టాలీవుడ్ మ‌రో హాలీవుడ్ గా ప్ర‌మోటైన‌ట్టే. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నాయి. బాలీవుడ్ సైతం టాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకుని పోటాపోటీగా సినిమాల్ని తెర‌కెక్కించేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఒక నిర్మాత‌గా న‌టుడిగా గొప్ప విశ్లేష‌ణ చేయ‌గ‌లిగే స‌మ‌ర్థ‌త‌ ద‌గ్గుబాటి వార‌సుడు రానా కి ఉంది.

అత‌డు ఇచ్చిన ఈ రివ్యూ ప్రాజెక్ట్ కె పై అంచ‌నాల‌ ను అమాంతం పెంచ‌గ‌ల‌దు. రానా చెప్పిన‌దే నిజ‌మైతే మ‌రోసారి తెలుగు సినిమా ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌ పై వైభ‌వంగా స‌త్తా చాటుతుంద‌ని గ‌ర్వంగా చెప్పుకోగ‌లం. ఈసారి ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలో గోల్డెన్ గ్లోబ్- ఆస్కార్ బ‌రిలోకి వెళ్లే సినిమా ప్రాజెక్ట్ కె అవుతుంద‌ని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు ప్ర‌భాస్- నాగ్ అశ్విన్- అశ్వ‌నిద‌త్ అండ్ టీమ్.