రానా లిప్ లాక్ నెట్టింట సంచలనం!

Mon Sep 26 2022 19:42:18 GMT+0530 (India Standard Time)

Rana lip lock social media viral

టాలీవుడ్ హంక్ రానా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడం ఆయన స్టైల్. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందంటే?  దానికి కారణం రానా ఎంపిక చేసుకునే కథలే. పాన్ ఇండియాలో రానాకి గుర్తింపు దక్కడం వెనుక ఆ  వేరియేషన్ కీలక పాత్ర పోషించదని చెప్పొచ్చు. వీలైనంత వరకూ తనలో యాక్టింగ్ స్కిల్స్ ని కొత్తగా ప్రజెంట్  చేయడానికే చూస్తాడు.అడల్ట్ కంటెంట్ కి   మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. చాలా రేర్ గానే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు. పెళ్లైన తర్వాత వాటి జోలికి పోనే పోలేదు అన్న ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఇప్పుడో సీన్ డిమాండ్ చేయడంతో మరోసారి ఘాడమైన లిప్ లాక్ సీన్లలో నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం రానా--వెంకటేష్ కలిసి `రానా నాయుడు` అనే నెట్ ప్లిక్స్ వెబ్ సిరీస్  లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వెంకటేష్ మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. నెరిసిన తల..గెడ్డం లు క్ ఆద్యంతం వెంకీన కొత్తగా ప్రజెంట్ చేస్తుంది. తాజాగా ఈసిరీస్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో రానా సన్నివేశాలు డిమాండ్ చేయడంతో హీరోయిన్ తో ఏకంగా ఘాడమైన పెదవి ముద్దు సన్నివేశాల్లో హద్దులు మీరి నటించినట్లు కనిపిస్తుంది.

అయితే ఈ లిప్ లాక్ పై నెటి జనులు భగ్గుమంటున్నారు. పెళ్లైన రానా ఇలాంటి సన్నివేశాల్లో నటించవచ్చా? అంటూ విమర్శిస్తున్నారు. పెళ్లికి ముందు ఇలాంటి వాటి జోలికి పోలేదు? ఇప్పుడేంటి కొత్తగా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది రాని తప్పిందం కాదని మరికొంత మంది వత్తాసు పలుకుతున్నారు.  ఈవెబ్ సిరీస్ ఒరిజినల్ వెర్షన్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే  ఉంటుంది.

అమెరికన్ సిరీస్ `రే డోనోవాన్` కి ఇండియన్ రీమేక్ గా తెరకెక్కుతోంది. అందులో కనీసంగానైనా చూపించాలని ఇలాంటి సన్నివేశాలకు తావు ఇచ్చినట్లు కనిపిస్తుంది.  ఇప్పటి వరకు రానా నటించిన చిత్రాలలో పెద్దగా హీరోయిన్‌తో లిప్‌లాక్ చేసింది లేదు. రామ్‌గోపాల్ వర్మ `డిపార్ట్‌మెంట్` సినిమాలో నథాలియాతో కలిసి రొమాంటిక్ సీన్స్‌లో నటించిన రానా.. ఆ తర్వాత వాటికి జోలికి పెద్దగా పోలేదు. ఆ మధ్య బాలీవుడ్ సినిమాలో బిపాసాబసుతో రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా.. ఆమె లిప్‌ని మాత్రం రానా లాక్ చేయలేదు. ఇండియాలో వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతోన్న నేపథ్యంలో హీరోలు సరళిని ఈ రకంగా మార్చుకోవాల్సి వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.