400 గిరిజన కుటుంబాలకు రానా సాయం

Wed Jun 09 2021 20:00:02 GMT+0530 (IST)

Rana assistance to 400 tribal families

సెకండ్ వేవ్ సమయంలో స్టార్లంతా తమవంతు సాయానికి ముందుకొస్తున్నారు. ప్రజల్ని కరోనా రోగుల్ని ఆదుకునేందుకు వెనకాడడం లేదు. ఈ మహమ్మారి కష్టకాలంలో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు. మహమ్మారి సమయంలో ప్రాథమికంగా అవసరమైన నిత్యావసరాలకు కూడా కనీస అవకాశం లేని నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు సహాయం చేయడానికి రానా ఏర్పాట్లు చేశారు. గిరిజన గ్రామాల్లోని మొత్తం సమూహంలోని ప్రజలకు కిరాణా సామాగ్రి మందులు అందించారు.అలారంపల్లి బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు .. గుర్రాం మధీరా- పాల రెగాడి- అడ్డాల తిమ్మపూర్- మీసాల భూమన్న గుడమ్- గగన్నపేట- కనిరామ్ తాండా- చింతగుడమ్- గోంగూరం గుడా- కడెం మండలాల కుగ్రామాలకు సాయం అందించారు. మరోవైపు కళామతల్లి చేదోడు కార్యక్రమం ద్వారా 600 మంది సినీ వర్కర్స్ కు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు- చదవాలవాడ శ్రీనివాస్ రావు- యలమంచిలి రవిచంద్ తమవంతు సాయం అందించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దగ్గుబాటి రానా నటించిన అరణ్య ఇటీవల రిలీజైంది. తదుపరి విరాఠ పర్వం రిలీజ్ కి రావాల్సి ఉంది. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.