Begin typing your search above and press return to search.

ఇదంతా కాదు రానా..ద‌ర్శ‌కుడినే మార్చేయ‌మంటున్నారే!

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:00 AM GMT
ఇదంతా కాదు రానా..ద‌ర్శ‌కుడినే మార్చేయ‌మంటున్నారే!
X
తేజ‌కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతుంది. `నేనే రాజు నేనే మంత్రి` త‌ర్వాత హిట్ లేదు. ఈ మ‌ధ్య రిలీజ్ అయిన `అహింస` కూడా ప్లాప్ ని మూట‌గ‌ట్టుకుంది. `నేనే రాజు నేనే మంత్రి` చిత్రం కంటే ముందుకెళ్తే ఆయ‌న స‌క్సెస్ చూసి 15 ఏళ్లు అవుతుంద‌ని మ్యాట‌ర్ క్లియ‌ర్ గా ఉంది. `జ‌యం` త‌ర్వాత చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టి కూడా లేదు. కానీ యంగ్ హీరోల్ని లాంచ్ చేయ‌డంలో ఆయ‌న స్పెష‌ల్ కాబ‌ట్టి! నిర్మాత రామానాయుడు మ‌న‌వ‌డిని అత‌ని చేతుల్లో పెట్టి లాంచ్ చేసారు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన ఆ సినిమా `అహింస` ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. ఔడెటెడ్ స్టోరీ తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన సినిమా గా నిలిచింది. తేజ స‌క్సెస్ మార్క్ ఎక్క‌డా? అని భూత‌ద్దం పెట్టి నెలికినా క‌నిపించ లేదు. అయితే అప్ప‌టికే రానా-తేజ ఓ మాట అనేసుకున్నారు. `రాక్ష‌స‌రాజ్యం` అనే సినిమా చేయాల‌ని ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కుదిరింది. ఈ కాంబోని షాకింగ్ అన‌డానికి లేదు. ఎందుకంటే రానా కి `నేనే రాజు నేనే మంత్రి` అనే సినిమాతో ఓ స‌క్సెస్ అందించాడు.

న‌టుడిగా అత‌నికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాడు. ఆ కాన్పిడెన్స్ తోనే అభిరామ్ ని అత‌ని చేతుల్లో పెట్టి ఉండొచ్చు. ఆ కృత‌జ్ఞ‌త‌గా రానా రాక్ష‌స రాజ్యం చేస్తాన‌ని ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ తేజ స‌క్సెస్ ట్రాక్ చూస్తే రానా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడ‌నే విమర్శ‌లొస్తున్నాయి. ఔడెటెడ్ ద‌ర్శ‌కుడితా రానా సినిమా క‌రెక్టేనా? అని అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. టాలీవుడ్ తాజా సినార‌లే తేజ ఇమ‌డ‌టం క‌ష్ట‌మ‌ని...అత‌ని స్థానంలో మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే ఉత్త‌మం అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

పైగా తేజ లాంటి ద‌ర్శ‌కుడితో పాన్ ఇండియా సినిమా అంటే! అది ఎంత పెద్ద సాహ‌సం అవుతుందో కూడా హీరోగారు ఓ సారి సీరియ‌స్ గా పున‌శ్చ‌ర‌ణ చేసుకోవాలంటున్నారు. ద‌ర్శ‌కుడిపై అభిమానంతోనో.. సాన్నిహిత్యం తోనే..కృత‌జ్ఞ‌త‌తోనే సినిమా చేస్తే! ఫ‌లితాలు ఎలా ఉంటాయో కూడా ముందే గెస్ చేయోచ్చు అని సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ‌హుశా ఇంత నెగిటివిటీ రావ‌డానికి `అహింస` ప‌రాజ‌యం ప్ర‌ధాన కార‌ణంగా కావొచ్చు. ఆ సినిమా హిట్ అయితే ఇన్ని ర‌కాల విమ‌ర్శ‌లొచ్చేవి కాదేమో. మ‌రి భ‌ల్లాల దేవ మ‌న‌సులో ఏముందో? ఎవ‌రికి ఎరుక‌.