ఆ విషయంలో నేను టెర్మినేటర్ అంటున్న రానా..!

Fri Mar 17 2023 10:21:14 GMT+0530 (India Standard Time)

Rana Daggubati About Health Issues

దగ్గుబాటి సినీ వారసుడు రానా ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్నాడు. తనదైన శైలిలో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న రానా ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా తన కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు రానా.రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటించిన రానా అందులో బాబాయ్ వెంకటేష్ కి పోటీ ఇచ్చేలా విజృంభించాడు. సినిమా నెగిటివ్ టాక్ తో మొదలైనా ఇప్పుడు అదే సూపర్ పబ్లిసిటీ గా మారి నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 వెబ్ సీరీస్ గా నిలిచింది.

రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా రానా ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. వీటిలోనే తన హెల్త్ సమస్యల గురించి చాలా రోజుల తర్వాత ప్రస్తావించాడు రానా. తనకు కంటి కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగాయని.. కార్నియా ట్రాన్స్ ప్లాంట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసని.. తన కుడి కన్ను సరిగా కనిపించేది కాదని.. దానికి ఆపరేషన్ చేశారని.. కిడ్నీ సమస్య కూడా ఉండగా దానికి కూడా సర్జరీ చేయించుకున్నానని అన్నారు. ఈ సర్జరీ జరిగినప్పుడు తానొక టర్మినేటర్ లా భావిస్తానని అన్నారు.

అనారోగ్యం మనిషిని బాధపెడుతుంది. కొందరు పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా ఆ ఆలోచన నుంచి బయటకు రాకుండా బాధపడుతుంటారు. అలా కాకుండా ఆ ఆలోచనలు ఆపేసి ముందుకెళ్లాలని అన్నారు. ఇదివరకు సమంత హోస్ట్ గా చేసిన షోలో రానా మొదటిసారి తన అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చారు.

అయితే రానా వాటినన్నింటిని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అడపాదడపా వెబ్ సీరీస్ లను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రానా.

టాలీవుడ్ లో కమర్షియల్ మార్కెట్ ఉండి ఏదైనా ప్రయోగాలు చేయాలి అనే వారిలో రానా కూడా ఒకరు. రానా నాయుడు వెబ్ సీరీస్ తో నేషనల్ వైడ్ గా మరోసారి తన సత్తా చాటారు రానా. ఈ సినిమాతో వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.