Begin typing your search above and press return to search.
కృష్ణవంశీ కోసం రమ్యకృష్ణ ఛార్జ్ చేయలేదా?
By: Tupaki Desk | 21 March 2023 7:00 PMక్రియేటివ్ మేకర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'రంగమార్తాండ' గురించి చర్చ మామూలుగా జరగలేదు. స్పెషల్ షోకి పాజిటివ్ టాక్ రావడంతో వంశీ పేరు మళ్లీ పరిశ్రమలో గట్టిగానే వినిపిస్తుంది. చాలా కాలంగా సక్సెస్ లు లేకపోవడంతో ఆయనపై నెగిటివ్ పీడ్ బ్యాక్ తప్ప! ఇంతలా అందులోనూ సినిమా రిలీజ్ కి ముందు ఇంతలా పాజిటివ్ వైబ్ కనిపించలేదు. చందమామ తర్వాత ఆయన చేసిని సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. దాదాపు దశాబ్ధం పాటు ఆయనకు విజయమే లేదు. దీంతో అంతా కృష్ణవంశీ పేరు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది.
సరిగ్గా అదే సమయంలో 'రంగమార్తాండ' ప్రకటించడం...ఆలస్యమైనా ఎలాగూ పూర్తిచేయడం..రేపు రిలీజ్ కు రావడంతో? సన్నివేశం అంతా స్టార్ మేకర్ కి పాజిటివ్ గానే కనిపిస్తుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఓ కీలకమైన పాత్ర లో ఆమె కనిపించనున్నారు.
అయితే ముందుగా ఆ పాత్రకు రమ్యకృష్ణని అనుకోలేదుట. వేరే నటిని తీసుకుందామని వంశీ ప్రయత్నాలు చేస్తున్నారుట. ఈ ప్రాసస్ లో చాలా మందికి స్టోరీ వినిపించడం జరిగిందిట.
కానీ బడ్జెట్ కారణంగా ఆ నటులు ఎవరూ ముందుకు రాని సన్నివేశం ఎదురైందిట. దీంతో రమ్యకృష్ణకు తనకు తానుగా ఆ పాత్ర పోషిస్తానని ముందుకొచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ఆ పాత్రకు గానూ రమ్యకృష్ణ కొంతైనా పారితోషకం ఏమైనా తీసుకున్నారా? కృష్ణవంశీ కోసం ఎలాంటి ఛార్జ్ చేయకుండా నటించారా? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఇద్దరు భార్య భర్తలు అన్న సంగతి తెలిసిందే.
అయితే దూరంగా ఉంటున్నట్లు మీడియాలో చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించడం..ఆమె నటన పట్ల వంశీ ఫిదా అవ్వడం.. కృష్ణవంశీ గురించి రమ్యకృష్ణ ఆసక్తికరంగా మాట్లాడటం..క్లైమాక్స్ లో ఆమె నటన చూసి వంశీ కన్నీళ్లు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు పరిశ్రమలో చర్చకొస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.