Begin typing your search above and press return to search.

స్వాతంత్య్రానికి కొత్త నిర్వచనం ఇచ్చిన రాంగోపాల్ వర్మ

By:  Tupaki Desk   |   15 Aug 2022 9:42 AM GMT
స్వాతంత్య్రానికి కొత్త నిర్వచనం ఇచ్చిన రాంగోపాల్ వర్మ
X
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ పండుగను మనం అందరం పండుగలా జరుపుకుంటున్నాం. ప్రతీ ఇంటింటా జెండాను ఎగురవేస్తున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఊరువాడా పండుగ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరూ తమ డీపీగా జాతీయ జెండాను పెట్టుకున్నారు. అయితే అందరికీ ఆనందం ఉంటే మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం స్వాతంత్య్రానికి కొత్త నిర్వచనం చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. స్వాతంత్య్రం అంటే 'భర్తకు భార్య నుంచి.. భార్య కు బోరింగ్ భర్త నుంచి స్వాతంత్య్రం పొందడం.. అంతేకాకుండా చికాకు కలిగించే తల్లిదండ్రుల నుంచి స్వాతంత్య్రం పొందడమే' అని చెప్పాడు.

పెళ్లయిన వారికే ఆ భార్యల బాధలు తెలుసు. ఇక కొంటె మొగుడులు, తాగుబోతు భర్తలు ఉంటే ఆ భార్యలకు నరకం.. ఇక తల్లిదండ్రుల పోరు భవిష్యత్ కోసం తప్పదు. వీటన్నింటి దాటి భార్యకు దూరంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు కాబట్టే మన ఆర్జీవీలో ఆ స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు సరైన నిర్వచనం ఇచ్చాడని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

భార్య బాధితులకు, భర్త బాధిత మహిళలకు, తల్లిదండ్రుల టార్చర్ ను అధిగమించినప్పుడే అసలైన స్వాతంత్య్రం అని ఆర్జీవీ ఇచ్చిన నిర్వచనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాంగోపాల్ వర్మ ట్వీట్ కు చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. ఆర్టీవీ నీ నిర్వచనం సూపర్ అంటూ కొంతమంది బాధిత పురుష పుంగవులు దీనంగా కామెంట్లు చేస్తుండడం గమనార్హం.