చరణ్ ట్రిపుల్ ధమాకా పై ఘనమైన ప్రకటన

Thu Jan 27 2022 09:00:02 GMT+0530 (IST)

Ramcharan Upcoming Movies

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ అందనుంది. అతడు నటించిన మూడు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ తో విడుదల కానున్నాయి. రిపబ్లిక్ డే నైట్ కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దిల్ రాజు- రామ్ చరణ్ అభిమానుల కోసం ఎగ్జయిట్ చేసే సమాచారాన్ని అందించారు.``రామ్ చరణ్ అభిమానులు చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. ఈ ఏడాదిలో చరణ్ నుంచి మూడు కొత్త థియేట్రికల్ రిలీజ్ లు ఉంటాయి. RRR- ఆచార్య - RC15 మూడు సినిమాలొస్తున్నాయి. చరణ్ నుండి కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ మూవీస్ కోసం సిద్ధంగా ఉండండి`` అని దిల్ రాజు అన్నారు. RRR ఏప్రిల్ 28న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య సంవత్సరం చివరి భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రెండిటికీ భిన్నంగా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ఆర్.సి 15 ఉంటుందని దిల్ రాజు హింట్ ఇచ్చారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఆర్.సి 15 లో చరణ్ యువ ఐఏఎస్ గా పొలిటికల్ సిస్టమ్ కి ఎదురు తిరిగేవాడిగా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సీజన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.