Begin typing your search above and press return to search.
మేం నిశ్శబ్దంగా ఉండం.. చిరుతనయుడి వార్నింగ్
By: Tupaki Desk | 29 Jan 2023 12:33 PMమెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా నైజాంలో జరిగిన సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ స్పీచ్ ఆద్యంతం మెగాభిమానులు సహా అందరినీ కట్టి పడేసింది. రంగస్థలం లాంటి విజయవంతమైన చిత్రాన్ని తనకు అందించిన మైత్రి నిర్మాతలు తన తండ్రి (కాదు అన్నయ్య)గారికి ఇచ్చినందుకు వారికి చరణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
చరణ్ మాట్లాడుతూ-``ఈ రోజు నేను ఇక్కడకు హీరోగానో లేక ఇంకోలానో రాలేదు. మీలోంచి మరో అభిమానిగా వచ్చాను`` అని చరణ్ అన్నారు. స్పీచ్ చివరిలో చరణ్ సైలెంట్ వార్నింగ్ వేదిక వద్ద చర్చకు వచ్చింది. ``చిరంజీవి గారు సైలెంట్ గా ఉండే మనిషి. అతను అంత నిశ్శబ్దంగా ఉంటే ఈ రోజు వేలాది మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. అతను కొంచెం దూకుడుగా ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి. అతను నిశ్శబ్దంగా ఉన్నా లేదా దూకుడుగా ఉన్నా.. మేం నిశ్శబ్దంగా ఉండం. మేం అస్సలు (అభిమానులు) నిశ్శబ్దంగా ఉండము! అని నేను మీకు నిశ్శబ్దంగా చెబుతున్నాను...`` అంటూ చరణ్ ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు.
చిరంజీవిగారిని ఉత్తమ అవతారంలో చూపించిన దర్శకుడు బాబీకి ధన్యవాదాలు తెలిపిన చరణ్ తనకు ``చిరంజీవి అన్నలాగా కనిపిస్తున్నారు కానీ నాన్నలా కాదు!`` అని ప్రశంసలు కురిపించారు. చరణ్ స్పీచ్ ఆద్యంతం మాస్ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజులో కొనసాగింది. మెగా పవర్ స్టార్ నెవ్వర్ బిఫోర్ స్పీచ్ విన్న అభిమానుల్లో ఉత్సాహం పదింతలైంది. దీంతో వేదిక వద్ద జోష్ కనిపించింది.