4.05 పీఎం ట్రీట్ కోసం చరణ్ ఫ్యాన్స్ రెడీ

Sun Nov 28 2021 11:23:04 GMT+0530 (IST)

Ramcharan Fans Ready for Treat

మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 2022 ఆరంభంలో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి.నేటి సాయంత్రం 4.05 గం.లకు సిద్ధ సాగా టీజర్ ట్రీట్ అభిమానులకు అందనుంది. తాజాగా ప్రోమోని విడుదల చేయగా అభిమానుల్లోకి దూసుకెళుతోంది. ఇందులో రామ్ చరణ్ గన్ పట్టుకుని వారియర్ లా కనిపిస్తున్నాడు. అడవుల్లో ఉద్యమకారుడిగా అతడి ఉగ్ర రూపం ఈ చిత్రంలో చూడబోతున్నామని చరణ్ లుక్ చెబుతోంది. ప్రోమోలో పూజా హెగ్డే సహా దర్శకులు ఇతర టీమ్ సభ్యులు కనిపిస్తున్నారు.

సాయంత్రం ట్రీట్ కోసం అభిమానులు వెయిటింగ్. ఇందులో చరణ్ -చిరు నువ్వా నేనా అంటూ పోటీపడే పాత్రల్లో నటిస్తుండడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇక రామ్ చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ కోసం చరణ్ సిద్ధమవుతున్నారు.