Begin typing your search above and press return to search.

#RRR ఎన్టీఆర్ టీజ‌ర్ .. భీమ్ తో అల్లూరి గ్యాంబ్లింగ్

By:  Tupaki Desk   |   14 Oct 2020 6:45 AM GMT
#RRR ఎన్టీఆర్ టీజ‌ర్ .. భీమ్ తో అల్లూరి గ్యాంబ్లింగ్
X
దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఫిక్ష‌న్ సినిమా అన‌గానే జ‌క్కన్న ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడు? విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఫిక్ష‌నల్ పాత్ర‌ల్ని ఎలా తీర్చిదిద్దారు? అన్న ఆస‌క్తి నెల‌కొంది. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ ఎలా ఉంటారో ఇంత‌కుముందు బ‌ర్త్ డే మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్ వెల్ల‌డించాయి. అయితే కొమ‌రం భీమ్ పాత్ర‌లో తార‌క్ లుక్ ఎలా ఉంటుందో బ‌ర్త్ డే రోజు తేల్తుంద‌ని ఆశించిన యంగ్ య‌మ అభిమానులకు మాత్రం అది సాధ్య‌ప‌డ‌లేదు. ఎట్టకేల‌కు భీమ్ లుక్ ఎలా ఉండ‌బోతోందో క‌నులారా ఫ్యాన్స్ వీక్షించ‌నున్నారు.

లాక్ డౌన్ అనంత‌రం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌కుముందే.. ఎన్‌టిఆర్ పై కొన్ని రోజుల పాటు చిత్రీక‌ర‌ణ సాగించారు రాజ‌మౌళి. టీజ‌ర్ కి అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని కీల‌క షాట్స్ తీసారు. కొన్ని రోజుల చిత్రీక‌ర‌ణ త‌ర్వాత దానిని ఆపేసారు. భీమ్ టీజర్ కు అవసరమైన షాట్ ‌లను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని క‌థ‌నాలొచ్చాయి. తాజా గా భీమ్ లుక్ పై ప్రోమో రిలీజ్ చేసేందుకు జ‌క్క‌న్న ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోమోలో ఎన్టీఆర్ ప్రత్యేక సంభాషణ రివర్టింగ్ అవుతుందని లేటెస్టుగా క‌థ‌నాలొస్తున్నాయి. ఎన్.‌టి.ఆర్ ‌ను మునుపెన్నడూ చూడ‌ని విధంగా భీక‌ర‌మైన‌ డైలాగ్ ‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట‌.

అన్నింటికంటే మించి,... ప్రత్యేక స్లో-మోషన్ షాట్లలో ఎన్టీఆర్ ప్రదర్శించే అభిన‌యం హైలైట్ గా నిలుస్తుంద‌ట టీజ‌ర్ లో. దేశభక్తితో కూడిన ఈ పాత్ర‌ను రాజ‌మౌళి ఎంతో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది.