Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గా మారిన టాలీవుడ్ యాక్టర్.. 'రామన్న యూత్' ఫస్ట్ లుక్ రిలీజ్..!

By:  Tupaki Desk   |   4 July 2022 5:36 PM GMT
డైరెక్టర్ గా మారిన టాలీవుడ్ యాక్టర్.. రామన్న యూత్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
X
టాలీవుడ్ లో ఎంతో మంది యాక్టర్స్ మెగా ఫోన్ పట్టుకొని దర్శకులుగా మారారు. కొందరు డైరెక్టర్లుగా సక్సెస్ అయితే.. మరికొందరు మాత్రం ఒకటీ రెండు సినిమాలకే కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు యువ నటుడు అభయ్ బేతిగంటి (నవీన్ కుమార్ బేతిగంటి) కూడా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

'పెళ్లి చూపులు' చిత్రంతో అలరించిన అభయ్.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 'జార్జ్ రెడ్డి' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "రామన్న యూత్". ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న 'రామన్న యూత్' ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటులు ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.."ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా రూపొందిస్తున్నాడు. ఆయనకీ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అభయ్ కు, చిత్ర బృందానికి బెస్ట్ విశెస్" అని అన్నారు.

ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే లైన్ తో 'రామన్న యూత్' చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు అభయ్. వినోదంతో పాటు ఆలోచింపజేసే నేటి సామాజిక విషయాలు కథలో ఉండబోతున్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇది రొటీన్ కు భిన్నమైన కొత్త తరహా కథ ఇదని తెలుస్తోంది.

ఇందులో యూత్ లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో క్లీన్ షేవ్ లో కొత్తగా కనిపించాడు. ఇది అంక్షాపూర్ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. హైదరాబాద్ మహానగరంలో లింక్ ఉంటుందని తెలుస్తుంది. అభయ్ సరసన అనిల్ గీల హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీకాంత్ అయ్యంగార్ - తాగుబోతు రమేష్ - జబర్దస్త్ రోహిణి - యాదమ్మ రాజు - టాక్సీవాలా విష్ణు - అమూల్య రెడ్డి - కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి - జగన్ యోగిరాజు - బన్నీ అభిరాన్ - మాన్య భాస్కర్ - వేణు పొలసాని తదితరులు ఈ సినిమాల్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కమ్రాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి అభయ్ బేతిగంటి కి 'రామన్న యూత్' సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.