Begin typing your search above and press return to search.

'భీమ్' కి బాకీ పడిన 'రామరాజు'...!

By:  Tupaki Desk   |   20 May 2020 10:30 AM GMT
భీమ్ కి బాకీ పడిన రామరాజు...!
X
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వరల్డ్ వైడ్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. ప్రస్తుత పరిస్టుల వలన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదంటూ తారక్ ప్రకటించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తారక్ తో గల అనుబంధాన్ని పంచుకుంటున్నారు. 'కొమరం భీమ్' బర్త్ డే నాడు 'అల్లూరి సీతారామరాజు' అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతనితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు రామ్ చరణ్. ''హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. నేను నీకు తిరిగి చెల్లించుకోవాల్సిన బహుమతి ఒకటి ఉంది. మీకు ప్రామిస్ చేస్తున్నాను అద్భుతమైన దాన్ని మీకు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాను. ముందు ముందు మరిన్ని వేడుకలు ఉండబోతున్నాయి'' అని చరణ్ ట్వీట్ చేయడంతో పాటు 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్ పంచుకున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న ఈ ఫోటోలో అభిమానులను అలరిస్తోంది.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు 'ఆర్ ఆర్ ఆర్' నుండి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో ఎన్టీఆర్ ఇచ్చే గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ పాత్ర హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో సినీ అభిమానులకి మంచి అనుభూతిని పంచింది. అలానే ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా నేడు ఆయన ఫస్ట్ లుక్ మరియు 'రామరాజు ఫర్ భీమ్' విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఎన్టీఆర్ కి సంభందించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 'రామరాజు ఫర్ భీమ్' కోసం వెయిట్ చేసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఇదే విషయాన్ని చరణ్ గుర్తు చేస్తూ 'రామరాజు ఫర్ భీమ్' గిఫ్ట్ బాకీ ఉన్నానని ఎన్టీఆర్ కి విషెష్ చెప్పాడు.