టాలీవుడ్ మాస్ హీరోగా మ్యాచో స్టార్ అనే బ్రాండ్ సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్. ఎక్కువగా కమర్షియల్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. లక్ష్యం లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాస్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో హ్యాట్రిక్ మూవీగా ఉండబోతుంది అని అందరూ అంచనా వేస్తున్నారు. కమర్షియల్ అండ్ హీరో బేస్డ్ కంటెంట్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న శ్రీవాస్ ఇప్పుడు రామబాణం సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తూ ఉన్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ జోడిగా డింపుల్ హయాతి నటిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ గ్లింప్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు గోపీచంద్ అన్నగా కనిపిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ జగపతిబాబు మొదటి సారిగా లక్ష్యం సినిమాలో అన్నదమ్ములుగా నటించారు.
తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చిన కూడా అందులో జగపతిబాబు ప్రతి నాయకుడుగా కనిపించారు. అయితే మరోసారి ఈ మూవీలో జగపతిబాబు హీరోతో సమానమైన పాత్రలో కనిపించబోతూ ఉండడం విశేషం. శ్రీరామ నవమి గ్లింప్ లో శ్రీరాముడు లాంటి అన్నకు హనుమంతుడు లక్ష్మణుడు లాంటి తమ్ముడు నేను అని హీరో గోపీచంద్ చెప్పే డైలాగ్ ని హైలెట్ చేశారు.
దీనిని బట్టి అన్న కోసం ఎంతవరకైనా తెగించే తమ్ముడి పాత్రగా గోపీచంద్ రోల్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబుకి జోడిగా ఖుష్బూ సుందర్ నటిస్తోంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం.
ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక గత కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ కోసం చూస్తున్న గోపీచంద్ ఈ మూవీతో తిరిగి దానిని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.