Begin typing your search above and press return to search.

శర్వా సంగీత్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్..!

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:12 AM GMT
శర్వా సంగీత్ వేడుకలో మెరిసిన రామ్  చరణ్..!
X
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి కొడుకు అయ్యాడు. ఆయన పెళ్లి సందడి మొదలైపోయింది. ఈరోజు రాత్రి అంటే జూన్ 3వ తేదీ రాత్రి 11గంటలకు పెళ్లి జరగనుంది. అయితే, ఇప్పటికే వధూవరులతో సహా వారి బంధువులు అంతా జైపూర్ చేరుకున్నారు. జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో వీరి వివాహం జరుగుతోంది. ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు పూర్తయ్యాయి. తాజాగా సంగీత్ వేడుక కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.

నిన్నటికి నిన్న హల్దీ వేడుకకు సంబంధించిన వైరల్ గా మారగా, తాజాగా సంగీత్ కి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ సంగీత్ వీడియోలో శర్వా అదరగొట్టాడు. చుట్టూ అమ్మాయిలు, మధ్య శర్వా ఒక్కడే ఉన్నాడు. కాగా, చిరంజీవి పూనకాలు లోడింగ్ పాటకు శర్వా నంద్ డ్యాన్స్ వేయడం విశేషం.

కాగా, ఈ సంగీత్ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. అక్కడ అందరితోనూ మాట్లాడుతూ రామ్ చరణ్ సందడి చేయడం విశేషం. చరణ్ తో పాటు, పలువురు ఇతర ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఈ పెళ్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక హల్దీ వేడుకలోనూ శర్వా సందడి చేశారు. అందులో శర్వానంద్ తెలుపు రంగు కుర్తా ధరించి ఉన్నారు.

ఆయన ముఖం మొత్తం పసుపు పూసి ఉంది. ఆ తర్వాత శర్వా వంతు వచ్చింది. ఆయన తన బంధువులు, కజిన్స్ అందరికీ పసుపు రాసి హడావిడి చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరినీ స్విమ్మింగ్ పూల్ లో తేసేశాడు. ఆ తర్వాత ఆయన్ని కూడా స్విమ్మింగ్ పూల్ లో ఆయన కజిన్స్ తోయడం విశేషం. వీడియో శర్వా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.

వీరి వివాహం రెండు రోజులపాటు జరగుతోంది. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్ది రోజుల క్రిందట శర్వా తన పెళ్లి పత్రికలను ముఖ్యమైన వారికి స్వయంగా ఆయనే పంచిపెట్టడం విశేషం.

ఇక శర్వానంద్ ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. రక్షిత రెడ్డి అమెరికాకు చెందిన టెక్కీ. ఆమెది ఏపీలో ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ. వధువు తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది కాగా.. తాత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పొలిటిషియన్ కావడం విశేషం.