Begin typing your search above and press return to search.

బ్రహ్మీతో చరణ్.. ఊహించని లుక్ వైరల్!

By:  Tupaki Desk   |   23 March 2023 5:00 PM GMT
బ్రహ్మీతో చరణ్.. ఊహించని లుక్ వైరల్!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సెలబ్రేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వైజ్ గా వచ్చిన స్టార్ ఇమేజ్ ని ఆశ్వాదిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే మరల శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ షూటింగ్ కి రెడీ అయిపోయాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్న సాంగ్స్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

ఈ సాంగ్ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కీయరా అద్వానీ రామ్ చరణ్‌పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందాన్ని అప్రిషియేట్ చేస్తూ సన్మానించారు.

రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ రోల్ లో మెస్మరైజ్ చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫొటోని చరణ్ షేర్ చేశారు.

ఈ ఫోటోలో చరణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఉండటం విశేషం. స్టైలిష్ లుక్ లో ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్‌లో కనిపించి మెప్పించిన రామ్ చరణ్ ఇప్పుడు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండటంతో అందరికి షాకిచ్చింది.

శంకర్ సినిమా కోసం ప్రత్యేకంగా ఈ అవతారంలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ లుక్ తండ్రి పాత్ర కోసం చేసుకున్నదా, లేదంటే యంగ్ రామ్ చరణ్ రోల్ కోసమా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంతో సినిమాని రామ్ చరణ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు. రంగస్థలంలో క్యారెక్టర్ కంటే బుచ్చిబాబు సినిమాలో పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని చెర్రి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ మూవీ కథాంశం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.