రూటు మార్చిన రామ్.. రేటు కూడా పెంచేసాడా..?

Wed Jun 09 2021 16:11:17 GMT+0530 (IST)

Ram who changed the root .. did he also increase the rate ..?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చుకుని 'ఉస్తాద్' గా మారిపోయాడు. దీంతో 'రెడ్' చిత్రాన్ని తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా మాస్ హీరోగా రామ్ డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. నిజానికి రామ్ నటించే సినిమాలన్నీ హిందీలోకి డబ్ కాబడి మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించ్చుకుంటున్నాయి. అందుకే రాపో సినిమాల డబ్బింగ్ రైట్స్ - డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడు పోతుంటాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియన్ క్రేజ్ కోసం రూట్ మార్చిన రామ్.. వరుసగా మల్టీలాంగ్వేజ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కూడా పెంచాడని ప్రచారం జరుగుతోంది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను తెలుగు తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

అలానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో రామ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇకపై తన సినిమాలన్నీ సౌత్ భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న రామ్.. 9 - 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. ఎలాగూ తన సినిమాలకు తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉంది కాబట్టి రామ్ దానికి తగ్గట్లే రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా యువ హీరో తన మార్కెట్ ని విస్తరించుకునే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.