Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ నుంచి రాం సీతా రాం.. విజువల్స్ అదిరియాయి..!
By: Tupaki Desk | 29 May 2023 12:41 PMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న విజువల్ వండర్ ఆదిపురుష్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇటీవల విడుదల చేసిన జై శ్రీరామ్ పాట అయితే అందరిలో భక్తి పారవశ్యం పొంగిపొరిలేలా చేశారు. కాస్తో, కూస్తో ఈ మూవీపై మొదటి నుంచి నెగిటివీ ఉండగా, అది కూడా జై శ్రీరామ్ పాటతో మొత్తం పోయిందనే చెప్పాలి. కాగా,తాజాగా ఈ రోజు మరోపాటను విడుదల చేశారు.
ద సోల్ ఆఫ్ ఆదిపురుష్ పేరిట రాం సీతా రాం పాటను తాజాగా ఈ రోజు అంటే మే 29వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో విడుదల చేశారు. ఈ పాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంది.
సీత దూరమై రాముడు పడిన బాధ, రాముడు లేక సీత పడుతున్న వ్యధను ఈ పాటలో విజువల్స్ రూపంలో చూపించారు. ఇక వీరిద్దరికీ హనుమయ్య వారధిలా పని చేయడం. ఒకరి గుర్తులను మరొకరికి చేర్చడంలో సహాయం చేశాడు.
పాటలోని విజువల్స్ ఎంత అందంగా ఉన్నాయో, పాట కూడా అంతే అందంగా, అద్భుతంగా ఉందని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో ఈ పాటను విడుదల చేయడం విశేషం.
కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, మూవీ చానెల్స్, జీఈసీ, దాదాపు డెబ్బైకి పైగా రేడియో స్టేషన్లలో, న్యూ చానెల్స్, ఆన్ లైన్, టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫామ్స్, మూవీ థియేటర్లలో ఈ పాటను ఒకేసారి విడుదల చేయడం విశేషం.
ఇక ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. రామ భక్తులు కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం విదితమే. ఈ సిమాలో రాముడి గా ప్రభాస్ కనిపిస్తుండగా, సీత గా కృతి సనన్ నటిస్తోంది. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.