Begin typing your search above and press return to search.

రామ్ సేతు టీజ‌ర్ ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:58 AM GMT
రామ్ సేతు టీజ‌ర్ ఇంట్రెస్టింగ్!
X
బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ `ఆంట్ర‌గిరే` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. ఆపై న‌టించిన `బ‌చ్చ‌న్ పాండే`..`సామ్రాట్ పృథ్వీరాజ్`..`ర‌క్షాబంధ‌న్` చిత్రాలు భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అక్ష‌య్ ఖాతాలో వ‌రుస‌గా సినిమాలున్నా..ఫెయిల్యుర్స్ త‌ప్ప స‌క్సెస్ లు క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 25న యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ `రామ్ సేతు` ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. జాక్వెలిన్ పెర్నాండేజ్.. న‌ష్ర‌త్ బ‌రుచా..స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ బ‌జ్ ని తీసుకొస్తున్నాయి. తాజాగా సినిమా టీజ‌ర్ ని కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ చేసారు.

రామసేతును రక్షించడానికి మాకు 3 రోజులు మిగిలి ఉన్నాయి అని అక్షయ్ చెప్పడంతో ప్రారంభమవుతుంది.ఇందులో అక్షయ్ కుమార్ ‘రామసేతు’ను రక్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అక్షయ్‌కు సత్యదేవ్.. జాక్వెలిన్‌లు సహకరిస్తున్నట్లు టీజర్‌‌ చూస్తే అర్థమవుతుంది. కానీ కథ ఏమిటనేది? టీజర్‌లో తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

రామసేతును రక్షించడం కోసం ఒక పెద్ద రోబెటిక్ సబ్‌మెరిన్‌ సాయంతో అక్షయ్ కుమార్ సముద్ర గర్భంలోకి వెళ్లడం అక్కడ ఓ దీవిని కనుగోవడం వంటి ఇంటెన్స్ సీన్స్‌ను టీజ‌ర్ లో హైలైట్ గా చెప్పొచ్చు. యాక్ష‌న్ సీన్స్ సినిమాలో హైలైట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. విజువ‌ల్ గానూ టీజ‌ర్ బాగుంది. నేప‌థ్య సంగ‌తం కొత్త అనుభూతినిస్తుంది.

ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. జాక్వెలిన్ రోల్ సైతం ఎంతో ఆస‌క్తిక‌రంగా మ‌లిచిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తీ పాత్ర‌ని కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నట్లు క‌నిపిస్తుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని అభిషేక్ శర్మ తెర‌కెక్కించారు. లైకా ప్రొడక్షన్స్- కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్- అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపావళి పురస్కరించుకుని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.