రామ్ కు మరో ఆరు నెలలు వెయిటింగ్ తప్పదా?

Sun Nov 22 2020 15:20:38 GMT+0530 (IST)

Ram Has To Wait another six months

ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే రెడ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రామ్ తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరి కాంబో మూవీ కోసం స్రవంతి రవికిషోర్ ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అయ్యేలా ఉంది కనుక త్రివిక్రమ్ మరియు రామ్ ల కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ మీడియా వర్గాల్లో చర్చ జరిగింది.ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కాబోతుందంటూ నిర్మాణ సంస్థ నుండి సమాచారం అందుతోంది. కనుక రామ్ తో త్రివిక్రమ్ సినిమా ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రామ్ తదుపరి సినిమా విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రామ్ కొత్త దర్శకులు తీసుకు వస్తున్న కథలకు ఒప్పుకోవడం లేదు. సీనియర్ దర్శకులు అంతా కూడా వేరు వేరు ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రామ్ కొత్త సినిమా ప్రారంభం అవ్వాలంటే మరో ఆరు నెలలు అయినా వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. కొత్త దర్శకులకు కమిట్ అయితే పర్వాలేదు కాసి సీనియర్ దర్శకుల కోసం వెయిట్ చేస్తే రామ్ మరో ఆరు నెలల పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ కథలు వింటూనే ఉన్నాడంటూ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.