Begin typing your search above and press return to search.

రామ్‌ గోపాల్ వర్మ 'రకరకాల భార్యలు'

By:  Tupaki Desk   |   26 July 2021 7:31 AM GMT
రామ్‌ గోపాల్ వర్మ రకరకాల భార్యలు
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్‌ ను ప్రకటిస్తాడో చెప్పలేం. ఆయన వరుసగా సినిమాలను చేస్తూనే వెబ్‌ మూవీస్.. షార్ట్‌ ఫిల్మ్‌ అంటూ చేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన ఒక వెబ్‌ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు. భార్యల రకాలను చూపించేందుకు తాను ఒక వెబ్‌ సిరీస్ ను తీయబోతున్నట్లుగా వర్మ అధికారికంగా ప్రకటించాడు. వర్మ వెబ్‌ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ఉంటుందట. ఆ ఎనిమిది ఎపిసోడ్స్ లో 8 రకాల భార్యలను గురించి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ గోపాల్ వర్మ పెళ్లి వ్యవస్థను నమ్మను అంటాడు. అలాంటి వ్యక్తి భార్యల గురించి చూపిస్తాను అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

మగవాడి జీవితం అతడికి దొరికే భార్యను బట్టి మారుతుంది. అలా ఎలాంటి భార్య దొరికితే జీవితం ఎలా మారుతుంది అనే విషయాన్ని ఒక ఎపిసోడ్‌ లో చూపించబోతున్నాడట. రక రకాల భార్యలు అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్ ను రెండు సీజన్ లుగా తీస్తానంటూ కూడా వర్మ పేర్కొన్నాడు. వర్మ ఏం చేసినా కూడా రచ్చ రచ్చ ఉంటుంది. ఇక ఈ భార్యల వెబ్‌ సిరీస్ రెండు సీజన్ లు ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఈయన సినిమాల సందడి లేదు. గోవాలో ఇన్నాళ్లు ఎంజాయ్‌ చేసిన వర్మ  మళ్లీ హైదరాబాద్‌ లో హడావుడి మొదలు పెట్టబోతున్నాడు.

30 వెడ్స్ 21 యూట్యూబ్‌ వెబ్‌ సిరీస్ తో ఈమద్య కాలంలో చాలా ఫేమస్ అయిన నటుడు చైతన్య ను వర్మ మీట్‌ అయ్యాడు. అదే సమయంలో తన రకరకాల భార్యలు వెబ్‌ సిరీస్ లో చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 30 వెడ్స్ 21 లో మంచి నటన కనబర్చిన చైతన్య వర్మ దృష్టిని ఆకర్షించాడు. అందుకే ఆయన్ను పెట్టి రకరకాల భార్యలు వెబ్‌ సిరీస్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. భార్యగా ఎవరు నటిస్తారు.. ఇతర నటీ నటులు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.