'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తీయడానికి స్ఫూర్తి?

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

Ram Gopal Varma On About Kama Rajyam Lo Kadapa Reddlu

`లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ తర్వాత `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని ప్రకటించారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ సెలెక్షన్ సహా ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ అసలు కులాలపై సినిమా తీయాలనుకోవడానికి కారణమేంటి? ఏ సంఘటన స్ఫూర్తినిచ్చింది? అని ప్రశ్నిస్తే ఆయనిచ్చిన సమాధానం షాకిస్తోంది.వైయస్సార్ కాంగ్రెస్ గెలిచాక వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు సడెన్ గా విజయవాడలో  కడప అట్మాసియర్ వచ్చింది. ఆరోజు నోవాటెల్ హోటల్లో మొత్తం కడప రెడ్లు ఉన్నారు. విజయ్ వాడ మొత్తం జగన్ వర్గాలే కనిపించాయి. కువైట్ లోకి ఇరాక్ ఆర్మీ వచ్చిన ఆక్రమించిన ఫీలింగ్ వచ్చింది అది చూశాక. ఎక్కడా చంద్రబాబు వర్గాల జాడ అయినా లేదు. జగన్ పీకి పడేశారు... అని తెలిపారు. విజయవాడ అంటే కమ్మలే అధికంగా ఉంటారు. అలాంటి చోట రెడ్డిల హవా చూశాని అదే ప్రేరేపించిందని తెలిపారు.

కడప రెడ్లు మాత్రమే నోవాటెల్ లో ఉన్నారని మీకెలా తెలిసింది? అని ప్రశ్నిస్తే.. వాళ్ల డ్రెస్సింగులు.. వాళ్ల వెహికల్స్.. అన్నీ జమానా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. పరిటాల టైమ్ నుంచి చూస్తున్నాం. టోటల్ గా ఒక ఫ్యూడలిజం ఉంటుంది అని అన్నారు. ఈ మార్పు కొత్తది. ఇంతకుముందు రాష్ట్ర విభజన టైమ్ లో లేదు. విభజన తర్వాత వచ్చింది ఈ మార్పు. లైవ్ గా అది నా కళ్ల ముందే జరిగింది కాబట్టి ఆ ఫీల్ వచ్చింది. దానినుంచి స్ఫూర్తి పొంది సినిమా తీస్తున్నానని అన్నారు. నోవాటెల్ కిక్కిరిసిపోయి .. ఇన్విజన్.. గా కనిపించినప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వినిపించిందని తెలిపారు.