చరణ్ స్టైలష్ లుక్.. పోయింది అదిరి పోయింది

Sun Nov 27 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Ram Charan stylish look

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు సంబంధించి ఒక పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పాట చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు.భారీ బడ్జెట్ తో ఈ పాట ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో ఒకటి లేదా రెండు పాటలు భారీ ఖర్చుతో విజువల్ వండర్ అన్నట్లుగా రూపొందుతూ ఉంటాయి. అలాంటి పాటలో ఈ పాట ఒకటి అంటూ సమాచారం అందుతుంది.

అంతటి భారీ పాటలో రామ్ చరణ్ లుక్ ఈ రేంజ్ లో ఉంది అంటే కచ్చితంగా పాట మరో స్థాయిలో ఉంటుందని నమ్మకం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్ కి మరో జోడిగా అంజలి నటిస్తున్నట్లుగా ఇటీవల లీక్ అయిన కొన్ని ఫొటోస్ ని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా లో ఇంకా శ్రీకాంత్ ఎస్ జె సూర్య నవీన్ చంద్ర సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాకి సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా ను విడుదల చేసేలా దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.