Begin typing your search above and press return to search.

‘క్రాక్’మూవీపై స్పందించిన రామ్ చరణ్!

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:35 AM GMT
‘క్రాక్’మూవీపై స్పందించిన రామ్ చరణ్!
X
వారం ముందే సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టేశాడు మాస్ మహరాజ్ రవితేజ. ఆయన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ జనవరి 9న రిలీజై సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమాపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందించాడు.

క్రాక్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు చెర్రీ. తాను ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పాడు. తన అభిమాన నటుడు రవితేజ ప్రస్తుతం టాప్‌ ఫాంలో ఉన్నారని, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించాడు చెర్రీ.

ప్రముఖ క్యారెక్టర్ ఆరిస్టు సముద్రఖని, వరలక్ష్మీశరత్‌ కుమార్‌ తమ నటనతో అదరగొట్టారని చెప్పాడు. ఇక థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అదిరిపోయిందన్న చెర్రీ.. గోపీచంద్‌ సినిమాను తెరక్కించిన విధానం అద్భుతం అంటూ చెప్పుకొచ్చాడు. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా రవితేజకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ కాంప్లిమెంట్ కు డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించారు. చెర్రీకి ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి బహుమతి అందించామని, ఇందుకు గర్వపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

కాగా.. ర‌వితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం క్రాక్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో.. చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న ర‌వితేజ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఈ సినిమా గురించి సానుకూలంగా స్పందించడంతో ‘థాంక్స్‌ బ్రో’ అంటూ అభిమానం చాటుకుంటున్నారు.